Share News

16 ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధం

ABN , Publish Date - Nov 20 , 2026 | 11:46 PM

ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి మండలంలో 16 ధాన్యం కొనుగోలు కేంద్రాలను పభుత్వం అందుబాటులో ఉంచిందని ...రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి ఎస్‌. గోవిందరావు తెలిపారు.

16 ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధం
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఏవో గోవిందరావు :

కోటబొమ్మాళి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి మండలంలో 16 ధాన్యం కొనుగోలు కేంద్రాలను పభుత్వం అందుబాటులో ఉంచిందని ...రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి ఎస్‌. గోవిందరావు తెలిపారు. శుక్రవారం జర్జంగి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం క్వింటా ధాన్యం రూ.2441కు, 80కేజీల బస్తా రూ.1952.80కు కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. గ్రేడ్‌ ఏ రకం క్వింటా రూ.3,461, 80కిలోల బస్తా 1960.80కు కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2026 | 11:46 PM