కాకరాపల్లి థర్మల్ ఉద్యమానికి15ఏళ్లు
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:33 AM
కాకరాపల్లి థర్మల్ పోరాటయోథులపై పోలీసుల కాల్పులకు పదిహేనుళ్లు పూర్తయింది. ఈస్టుకోస్టు థర్మల్ పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా పోరాడిన ఆం దోళనకారులపై పోలీసులు కాల్పులు జరి పారు.
పోలీసుల కాల్పుల్లో ముగ్గురు ఆందోళనకారుల మృతి
నేడు అమరవీరుల స్థూపం వద్ద సంస్మరణ సభ
సంతబొమ్మాళి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): కాకరాపల్లి థర్మల్ పోరాటయోథులపై పోలీసుల కాల్పులకు పదిహేనుళ్లు పూర్తయింది. ఈస్టుకోస్టు థర్మల్ పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా పోరాడిన ఆం దోళనకారులపై పోలీసులు కాల్పులు జరి పారు. ఈ దాడుల్లో ముగ్గురు అ మరులయ్యారు. శనివారం నాటికి ఈ ఘటన జరిగి పదిహేనుళ్లు పూర్తయింది. థర్మల్ పవర్ ప్లాంటు ని ర్మాణంతో వీధిన పడతామని వడ్డితాం డ్ర మత్స్యకారులు ఆందోళన బాటప ట్టారు. రిజర్వాయర్‌గా ఉండే తంపరలో పవర్‌ప్లాంట్ నిర్మిస్తే పంట పొలాలు నీటి మునగుతాయని రైతులు ఆందోళనలో భాగస్వాములయ్యారు. ఈ నేపఽథ్యంలో 2010 ఆగస్టు 15న వడ్డితాండ్రలో థర్మల్‌కు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ శర్మ నిరాహారదీక్ష ప్రారంభించారు. దీనికితోడు హనుమంతునాయుడుపేట (హెచ్‌ఎన్ పేట) వద్ద 2011 జనవరిలో సహాయ నిరాకరణ శిబిరాన్ని ఆందోళనకారులు చేపట్టారు. పవర్‌ప్లాంటుకు వాహనాలు, సిబ్బంది వెళ్లకుండా హెచ్‌ఎన్ పేట, వడ్డితాండ్ర శివారుల్లో ఆందోళనకారులు అడ్డగించారు. దీంలో అప్పటి ఎంపీ కిల్లి కృపారాణి హెచ్‌ఎన్ పేట వద్ద ఆందోళనకారుల సమస్యలు తెలు నుకొనే ప్రయత్నం చేశారు. థ ర్మల్ ఆగకుంటే ఆత్మహత్యలు చేసుకుంటామని ఆందోళనకా రులు ఒంటిపై కిరోసిన్ పో సుకోవడంతో పరిస్థితి ఒక్క సారిగా వేడెక్కడంతో ఎంపీ అక్కడ నుంచి వెళ్లిపోయారు.
పెల్లుబికిన రైతుల ఆగ్రహం
కాకరపల్లి, అంట్లవరం గ్రామాల సరిహద్దుల్లో పవర్‌ప్లాంటు యాజమాన్యం అనుమతి లేకుం డా కల్వర్టు నిర్మించడంతో పంటపొలాలు నీట మునగతాయని రైతులు ఆం దోళన చేపట్టారు. అక్రమంగా నిర్మించిన కల్వర్టును తొలిగించ డానికి ఆందోళనకారులు సిద్ధమయ్యారు. అప్పటి టెక్కలి ఆర్డీవో పి.అరుణ్‌బాబు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఆర్డీవో గతంలో కల్వర్టును తొలిగిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చకపో వడంతో ఆందోళనకారులు ఆయనపై దాడికి ప్రయత్నించారు. దీంతో 2011 ఫిబ్రవరి 25న విశాఖ రేంజ్ పరిధిలో మూడువేల మంది సాయుధ పోలీసులు వడ్డితాండ్ర, హెచ్‌ఎన్ పేట చేరుకుని దీక్ష శిబిరాలను తొలిగించారు.
మారణహోమం
వడ్డితాండ్రలో అప్పటి మత్స్య కార సొసైటీ అధ్యక్షుడు కారుణ్యఖత్రో ను అదుపులోకి తీసుకోవడంతో పోలీసులు ఆందోళనకారుల మధ్య వివాదం చెలరేగింది. దీంతో మత్స్యకారులపై పోలీసులు భాష్పావాయువును ప్రయో గించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 28న పోతునాయుడుపేటలో భారీగా పోలీసులను మోహరించారు. దీంతో సుమారు ఐదువేల మంది ఆందో ళనకారులు పోతునాయుడుపేట చేరుకొని పోలీసుల జీపులకు నిప్పం టించారు. దీంతో పోలీసులు రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరపగా.. ఈ కాల్పుల్లో సీరపు ఎర్రయ్య, జీరు నాగేశ్వరరావు అక్కడిక్కడే మృతి చెం దగా బత్తిన బారికవాడు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి చెం దాడు. వడ్డితాండ్రలో పోలీసుల బాం బులకు 25 పూరిళ్లు దగ్గమవ్వగా, వరి, గడ్డి కుప్పలు కాలిపోయాయి. దీనిపై అప్పట్లో ఎంపీ వి.హనుమం తురావు పార్లమెంట్‌లో ప్రస్తావించ గా... అప్పటి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జయరాం రమేష్ పవర్ ప్లాంటు అనుమతులు రద్దు చేస్తున్న ట్టు ప్రకటించారు. ఇంతలోనే థర్మల్ ఉద్యమనేతల్లో కొంతమంది పవర్ ప్లాంటు యాజమాన్యానికి అమ్ముడు పోవడంతో ఉద్యమం చిన్నాభిన్నమై మళ్లీ పనులు ప్రారంభమయ్యాయి. కొన్నాళ్లకు పవర్‌ప్లాంటు నిర్మాణంలో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో పను లు పూర్తిగా నిలిచిపోయాయి. యాజ మాన్యం సామగ్రి కూడా తలరించక పోగా.. గతేడా చిమ్ని కూడా నేల మ ట్టం చేశారు. అయితే 1108 జీవో రద్దు చేయాలని కోరుతూ వడ్డితాండ్రలో మత్స్యకారులు నేటికీ దీక్షను కొనసాగిస్తున్నారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన సీరపు ఎర్రయ్య, జీరు నాగేశ్వరరావు, బత్తిన బారికవాడు ఆత్మకు శాంతి చేకూరాలని శనివారం హెచ్‌ఎన్ పేట వద్ద గల స్మారక స్థూపం వద్ద సంస్మరణ సభ నిర్వహించనున్నారు.