Share News

15 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Jan 11 , 2026 | 12:07 AM

ఒడిశా నుంచి గంజా యి తరలిస్తున్న రెం డు కేసుల్లో 15 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించినట్టు సీఐ మీసాల చిన్నమనాయుడు తెలిపారు.

 15 కిలోల గంజాయి స్వాధీనం
ఇచ్ఛాపురం: వివరాలు వెల్లడిస్తున్న సీఐ చిన్నమనాయుడు

  • ఇచ్ఛాపురంలో రెండు కేసుల్లో నలుగురి అరెస్టు

ఇచ్ఛాపురం, జన వరి 10(ఆంరఽధజ్యోతి): ఒడిశా నుంచి గంజా యి తరలిస్తున్న రెం డు కేసుల్లో 15 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించినట్టు సీఐ మీసాల చిన్నమనాయుడు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ఒడిశాలో కొనుగోలు చేసిన 11.370కిలోల గంజాయిని తరలిస్తుండగా ఎంతోటూరు ఎల్‌సీ గేటు వద్ద రూరల్‌ ఎస్‌ఐ జనార్దనరావు తనిఖీ చేస్తుండగా పట్టుకొని ముగ్గురిని పట్టుకుని గంజాయిని సీజ్‌ చేశారు. బిహార్‌ రాష్ట్రం షేనార్‌ జిల్లాకు చెందిన అభ య్‌కుమార్‌సింగ్‌, చంద్రకళ దేవి, జగేంద్రర్‌రామ్‌ బిహార్‌కు చెందిన శశి సహాని అనే వ్యాపారి చెప్పినట్లుగా ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా బెలమగడకి చెందిన అచ్చఖల్‌ వద్ద గంజాయిని కొనుగోలు చేశారు. గుణుపూర్‌ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కి అక్కడ నుంచి బీహార్‌ వెళ్లే క్రమంలో ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌లో దిగారు. టౌన్‌లోకి వెళ్లి భోజనాలు ముగించుకొని తిరిగి హౌరా వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు వస్తుండగా ఎంతోటూరు రైల్వే ఎల్‌సీ గేటువద్ద పట్టుకున్నామన్నారు. వీరి వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఒడిశా రాష్ట్రం ఖుర్ధా జిల్లా మురమోరి గ్రామానికి చెందిన గణేష్‌ పరిడ అనే వ్యక్తి ఆర్థిక పరిస్థితి బాగులేక పోవడంతో గంజాయి వ్యాపారం చేసే ఖుర్ధా జిల్లా గుటపల్లి గ్రామానికి చెందిన భాస్కర్‌ రంతరాయ్‌ అలియాస్‌ జితు అనే వ్యక్తి వద్ద హైదరాబాద్‌లో కొల్లూరు ప్రాంతంలో పనిచేస్తున్నాడు. తాను చెప్పినట్లు గంజాయిని తెస్తే డబ్బులు ఇస్తానని ఆశ చూపాడు. దీంతో గణేష్‌ గంజాయిని, గంజాయి చాక్లెట్‌ను ఖుర్దా జిల్లా నాచూని గ్రామానికి చెందిన ప్రభాస్‌ (అలియాస్‌ పాత్రో) వద్ద 2కేజీల30 గ్రాముల గంజాయి, గంజాయి చాక్లెట్‌ని తీసుకొని హైదారాబాద్‌ వెళ్లేందుకు ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం రావటంతో పట్టణ ఎస్‌ఐ ముకుందరావుకు తనిఖీ చేయగా అతని వద్ద ఉన్న గంజాయి లభించింది. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు సీఐ తెలిపారు.

ఆమదాలవలసలో మరో ఇద్దరు..

ఆమదాలవలస, జనవరి 10(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని రైల్వేస్టేషన్‌ పార్కింగ్‌ ప్రాంతంలో శనివారం గంజాయితో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ సూర్యనారాయణ తెలిపారు. పట్టణంలోని ధర్మారావు క్వార్టర్స్‌ ప్రాంతానికి చెందిన పెద్ది యశ్వంత్‌కుమార్‌ ఎంపీడీవో కార్యాలయ సమీపం రామాలయ వీధికి చెందిన తాళ్లూరి దుర్గా ప్రసాద్‌ 10 గ్రాములు గంజాయితో ఉన్నట్టు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లిపట్టుకున్నామన్నారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

ఆరుగురు పేకాటరాయుళ్లు..

రణస్థలం, జనవరి 10(ఆంధ్రజ్యోతి): పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. దేవరాపల్లి గ్రామం సమీపంలోని ఒక తోటలో శనివారం పేకాట ఆడుతున్నటు పక్కా సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి దాడులు చేశామన్నారు. పేకాట ఆడుతున్న వారి నుంచి రూ.82,500 నగదు, 5 సెల్‌ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

మొబైల్స్‌ చోరీ కేసులో వ్యక్తి అరెస్టు

పలాస, జనవరి 10(ఆంధ్రజ్యోతి): రైలులో ప్రయాణికు ల సెల్‌ఫోన్లు చోరీ చేసిన వ్యక్తిని పలా స రైల్వే పోలీసులు శనివారం పట్టుకొని విశాఖ రైల్వేకోర్టులో హాజరుపరిచారు. ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. రైల్వే ఫ్లాట్‌ ఫారం-2లో రైల్వే పోలీసులు సాధారణ తనిఖీలు చేస్తుండగా.. ఒడిశా రాష్ట్రం జగన్నాథపురం గ్రా మానికి చెందిన శ్రీకాంత్‌ శేఖర్‌దాస్‌ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించా డు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. సెల్‌ఫోన్లు చోరీ వ్యవహా రం బయటపడింది. ఈ క్రమంలో అతడి నుంచి ఆరు ఫోన్లు స్వాధీనం చేసు కున్నారు. ఈ మేరకు శ్రీకాంత్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.

Updated Date - Jan 11 , 2026 | 12:07 AM