టీడీపీలో చేరిన 15 కుటుంబాలు
ABN , Publish Date - Oct 19 , 2026 | 11:18 PM
నందిగాం మండలం ఉయ్యాలపేట గ్రామానికి చెందిన 15 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి.
కోటబొమ్మాళి/నందిగాం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): నందిగాం మండలం ఉయ్యాలపేట గ్రామానికి చెందిన 15 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. సోమవారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో నిమ్మా డ క్యాంపు కార్యాలయంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి మంత్రి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. గ్రామానికి చెందిన గేదెల అప్ప న్న, మల్లేసు, కప్ప కామేశ్వరరావు, గిన్ని లక్ష్మీనారాయణ, రేషపు మధురెడ్డి, హరికృష్ణ, రాజేష్ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో కోటబొమ్మాళి పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, ఉ య్యాలపేట నాయకులు పి.శ్రీనివాస్‌రెడ్డి, డి.సింహాచలం పాల్గొన్నారు.
జిల్లా ప్రజలకు మంత్రి దసరా శుభాకాంక్షలు..
జిల్లా ప్రజలకు, రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు విజయదశమి శుభా కాంక్షలు తెలిపారు. కనకదుర్గ ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరి సంపదలు కలిగి ఉండాలని ఆకాంక్షించారు.