Share News

గూడ్సు రైలు ఢీకొని 140 గొర్రెలు మృతి

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:33 AM

నందిగాం మండలం చరణ దాసుపురం సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో గూడ్సు రైలు ఢీకొని 140 గొర్రెలు మృతిచెందాయి. ఈ ఘటనలో సు మారు రూ.12 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.

గూడ్సు రైలు ఢీకొని 140 గొర్రెలు మృతి
గూడ్సు రైలు ఢీకొనడంతో చెల్లాచెదురుగా పడివున్న మృతి చెందిన గొర్రెలు

  • సుమారు రూ.12 లక్షల నష్టం

  • జీవనాధారం కోల్పోయామని బాధితుల ఆవేదన

నందిగాం, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): నందిగాం మండలం చరణ దాసుపురం సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో గూడ్సు రైలు ఢీకొని 140 గొర్రెలు మృతిచెందాయి. ఈ ఘటనలో సు మారు రూ.12 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. నందిగాం మండలం సైలాడ పంచాయతీ దేవాడకు చెందిన లండ తిరుపతిరావు, నందిగాం పంచాయతీ వేణుగోపాలపురానికి చెందిన టొంప భూపతి, ఆయన అల్లుడు దేవుపురానికి చెందిన సా నిల చిన్నారావు గొర్రెలను మేతకు విడిచి పెట్టారు. శనివారం సాయంత్రం చరణదా సుపురం సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్ద గొర్రెలు మేత మేస్తూ పట్టాలు దాటుతు న్నాయి. నౌపడా నుంచి పలాస వైపు వెళ్తున్న గూడ్సు రైలు వాటిని ఢీకొనడంతో గొర్రెలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మొత్తం 140 గొర్రెలు మృతిచెందాయి. తమ కుటుంబాల జీవనాధారం దెబ్బతిందంటూ బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం ఆదుకోవా లని గొర్రెల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షుడు కుజ్జ తాతయ్య యాదవ్‌, జిల్లా గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ప్రతినిధి పాలిన సాంభమూర్తి కోరారు.

Updated Date - Oct 11 , 2026 | 12:33 AM