Share News

‘వీబీ-జీరామ్‌జీ’ ద్వారా 125 పనిదినాలు

ABN , Publish Date - Jul 02 , 2026 | 11:45 PM

‘VB-Jeeramji’ scheme starting ‘వికసిత్‌ భారత్‌ - జీరామ్‌జీ’ పథకం ద్వారా కూలీలకు ఏడాదికి 125 పనిదినాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పేర్కొన్నారు. గురువారం శ్రీకాకుళం మండలం గూడెం గ్రామంలో ‘వీబీ-జీరామ్‌జీ’ పథకాన్ని ఆయన ప్రారంభించారు.

‘వీబీ-జీరామ్‌జీ’ ద్వారా 125 పనిదినాలు
‘వీబీ-జీరామ్‌జీ’ పథకాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

అరసవల్లి, జూలై 2(ఆంధ్రజ్యోతి): ‘వికసిత్‌ భారత్‌ - జీరామ్‌జీ’ పథకం ద్వారా కూలీలకు ఏడాదికి 125 పనిదినాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పేర్కొన్నారు. గురువారం శ్రీకాకుళం మండలం గూడెం గ్రామంలో ‘వీబీ-జీరామ్‌జీ’ పథకాన్ని ఆయన ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ‘గత రెండేళ్లుగా ఉపాధిహామీ పథకం ద్వారా 40 శాతం రోడ్లు, కాలువలు, కొన్నిచోట్ల ఇతర అభివృద్ధి పనులు చేపట్టాం. ఇప్పటివరకు ఏడాదికి 100 రోజుల వరకు పనిదినాలు ఉండేవి. కానీ ఇప్పుడు 125 రోజుల పనిదినాలను ప్రభుత్వం కల్పిస్తోంది. అందరూ ఉత్సాహంగా పనులు పూర్తి చేయాలి. జలధార, జలహారతి కింద ఇప్పటికే 90 రోజుల పనులు పూర్తయ్యాయి. వర్షాలు కురిసిన తరువాత భూగర్భజల మట్టాలు పెరుగుతాయ’ని తెలిపారు. మాజీ ఎంపీపీ గొండు జగపతి మాట్లాడుతూ పేడ, బడుగు, బలహీన వర్గాల కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం 125 రోజులకు పెంచిందన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ లవరాజు, ఎంపీడీవో, ఏపీడీ, డ్వామా సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 11:45 PM