Share News

జాతీయ లోక్‌అదాలత్‌లో 12,159 కేసుల పరిష్కారం

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:51 PM

National Lok Adalat జిల్లా న్యాయస్థానాల సముదాయంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో మొత్తం 12,159 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా న్యాయాధికారి కొండబోలు సునీత తెలిపారు. శ్రీకాకుళంలో నిర్వహించిన జాతీయ లోక్‌అదాలతో ఆమె పాల్గొని మాట్లాడారు. ‘

జాతీయ లోక్‌అదాలత్‌లో 12,159 కేసుల పరిష్కారం
జాతీయ లోక్‌అదాలత్‌లో పాల్గొన్న జిల్లా న్యాయాధికారి సునీత

జిల్లా న్యాయాధికారి కొండబోలు సునీత

శ్రీకాకుళం లీగల్‌, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): జిల్లా న్యాయస్థానాల సముదాయంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో మొత్తం 12,159 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా న్యాయాధికారి కొండబోలు సునీత తెలిపారు. శ్రీకాకుళంలో నిర్వహించిన జాతీయ లోక్‌అదాలతో ఆమె పాల్గొని మాట్లాడారు. ‘జిల్లాలో 101 సివిల్‌ కేసులు, 11,987 క్రిమినల్‌ కేసులు, 50 ప్రీ లిటిగేషన్‌ కేసులు, 21 మోటార్‌ యాక్సిడెంట్‌ కేసులు పరిష్కారమయ్యాయి. వీటికి సంబంధించి ఆయా కక్షిదారులకు రూ.5.95 కోట్ల విలువైన నమూనా చెక్కులను అందజేశాం. శ్రీకాకుళంలోని జాతీయ లోక్‌అదాలత్‌ నాలుగు ప్రత్యేక బెంబచ్‌లు ఏర్పాటు చేశాం. కక్షిదారులకు ఉచితంగా ఆహార పొట్లాలు, మంచినీరు అందజేశామ’ని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా 2వ, అదనపు న్యాయాధికారులు బి.సాధుబాబు, సి.హెచ్‌ వివేకానంద శ్రీనివాస్‌, సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఆర్‌.శాంతిశ్రీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారులు కె.అనురాగ్‌, జమృత బేగం కమాలుద్దీన్‌, వి.సాహితి పాల్గొన్నారు

Updated Date - Sep 12 , 2026 | 11:51 PM