ఎన్నికల నేపథ్యంలో 12 కేసుల నమోదు
ABN , Publish Date - Nov 19 , 2026 | 12:08 AM
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 12 కేసులు నమోదు చేశామని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమి షనర్ ఎం.మనోహర్ తెలిపారు. పట్టణంలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్‌ను బుధవారం ఆకస్మి కంగా తనిఖీ చేశారు.
48 మంది పాత నేరస్థుల బైండోవర్
ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ మనోహర్
ఆమదాలవలస, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 12 కేసులు నమోదు చేశామని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమి షనర్ ఎం.మనోహర్ తెలిపారు. పట్టణంలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్‌ను బుధవారం ఆకస్మి కంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. మునిసిపల్ పంచాయతీల ఎన్నికల నేపథ్యం లో మద్యం అక్రమ తరలింపు నియంత్రణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 26న జరగనున్న ఆమదాలవలస మునిసిపాలిటీ, 29న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటివరకు తనిఖీలు చేసి 12 మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 14.4 లీటర్ల ఐఎంఎల్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. అదేవిధంగా 48 మంది పాత నేరస్థులను సంబంధిత తహసీల్దార్ల వద్ద హాజరుపరిచి బైం డోవర్ చేశామన్నారు. మద్యం అక్రమ రవాణా, విక్రయాలపై నిరంతరం నిఘా ఉంచాలని, అక్ర మ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్సైజ్ సీఐ జి.సతీష్‌కుమార్, ఎస్‌ఐలు కుమార్ కావ్య, అసిస్టెంట్ సూపరింటెండెంట్ పి.మురళీధర్ పాల్గొన్నారు.