వీడిపోతున్నామంటూ..
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:13 AM
Exams last day పదో తరగతి పరీక్షలు గురువారం ముగిశాయి. 145 కేంద్రాల్లో గత నెల 16న పరీక్షలు ప్రారంభమయ్యాయి. 28,598 మంది పరీక్షలు రాశారు.
ముగిసిన పదోతరగతి పరీక్షలు
కొంతమంది విద్యార్థుల భావోద్వేగం
నరసన్నపేట, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలు గురువారం ముగిశాయి. 145 కేంద్రాల్లో గత నెల 16న పరీక్షలు ప్రారంభమయ్యాయి. 28,598 మంది పరీక్షలు రాశారు. రోజు కేంద్రాల వద్ద కొంతమంది విద్యార్థులు సందడిగా కనిపించగా.. మరికొందరు భావోద్వేగానికి గురయ్యారు. ఐదేళ్లపాటు కలిసి చదివి.. ఒక్కసారిగా వీడిపోతున్నామని కన్నీరుపెట్టుకున్నారు. నరసన్నపేటలోని బీసీ బాలికలు, సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహాల్లో విద్యార్థినులు వార్డెన్ల వద్ద కన్నీరుపెడుతూ.. వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఇంకొందరు విద్యార్థులు భవిష్యత్ ప్రణాళికపై చర్చించుకుని.. ఏపీఆర్‌జేసీ, పాలిసెట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు.