10.5 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:49 PM
గంజాయిని తరలి స్తున్న ఇద్దరు మహిళలను శ్రీకాకుళం నగరం సమీపంలో ఎచ్చెర్ల పోలీసు స్టేషన్ పరిధి లోని కుశాలపురం సింహద్వా రం వద్ద అరెస్ట్ చేసినట్లు జేఆర్ పురం సీఐ ఎం.అవతా రం తెలిపారు.
- ఇద్దరు మహిళల అరెస్టు
ఎచ్చెర్ల, మార్చి 7(ఆంధ్ర జ్యోతి): గంజాయిని తరలి స్తున్న ఇద్దరు మహిళలను శ్రీకాకుళం నగరం సమీపంలో ఎచ్చెర్ల పోలీసు స్టేషన్ పరిధి లోని కుశాలపురం సింహద్వా రం వద్ద అరెస్ట్ చేసినట్లు జేఆర్ పురం సీఐ ఎం.అవతా రం తెలిపారు. ఈ మేరకు శనివారం ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు వివరాలను వెల్లడించారు. ఒడిశాకు చెం దిన కె.ప్రియాంకరాణి, ప్రధాన్ మహిళలు తమ బ్యాగుల్లో గంజాయిని పెట్టుకుని బెంగళూరు తరలించేందుకు సింహద్వారం వద్ద బస్సు కోసం వేచి ఉన్నారు. ఈ మేరకు వచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లగా వారిని చూసిన సదరు మహిళు పారిపోచే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని పట్టుకుని బ్యాగులను తనిఖీ చేశారు. ఆ బ్యాగుల్లో 8 ప్యాకెట్లలో 10.5 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని బెంగుళూర్‌కు తీసుకువెళ్లి అక్కడ అప్పగిస్తే రూ.10 వేలు వంతున ఇస్తారని వారు పేర్కొన్నట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎస్‌ఐ జి.లక్ష్మణరావు, సిబ్బంది పాల్గొన్నారు.