వైసీపీ నుంచి టీడీపీలోకి 100 కుటుంబాలు
ABN , Publish Date - May 14 , 2026 | 12:35 AM
పార్టీకు సేవలందించే ప్రతీఒక్కరికీ సముచిత స్థానం టీడీపీ కల్పిస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.
పార్టీ కండువా వేసి ఆహ్వానించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
పాతపట్నం/రూరల్, మే 13(ఆంధ్రజ్యోతి): పార్టీకు సేవలందించే ప్రతీఒక్కరికీ సముచిత స్థానం టీడీపీ కల్పిస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. తన క్యాంపు కార్యాల యంలో నియోజకవర్గ పరిధి ఎల్‌ఎన్ పేట మండలం బొత్తాడసింగి గ్రామానకి చెందిన సుమారు వంద కుటుంబాలు వైసీపీని వీడి బుధవారం ఎమ్మెల్యే సమక్షంలో బుధవారం చేరా యి. వారందరికీ పార్టీ కండువాలు వేసి స్వాగతిం చారు. ఈ సందర్భంగా టీడీపీ చేరినవారు మాట్లా డుతూ.. కూటమి పాలనలో జరగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై టీడీిపీలో చేరినట్టు తెలి పారు. పార్టీకి సేవలందించే వారికిస్తున్న ప్రాధా న్యం ఎంతో బాగందన్నారు. కార్యకర్తలకు అండ గా ఉండేందుకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు చూపుతున్న చొరవకు ఆకర్షితులమైనట్టు తెలిపా రు. బొత్తాడసింగి గ్రామానికి చెందిన 184వ ఫోకస్ బూత్‌లో వార్డుమెంబర్లు సవర భాస్కరరావు, సవ ర కాంతారావు, సవర వినోద్, సవర యశోదతో పాటు సుమారు 100కుటుంబాల వరకూ వైసీపీ ను వీడి టీడీపీలో చేరాయి. కార్యక్రమంలో ఫోకస్ బూత్ పరిశీలకులు ఇప్పిలి జగదీశ్వరరావుతోపాటు ఎల్‌ఎన్ పేట మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
‘చెత్త నియంత్రణ అలవాటుగా మారాలి’
చెత్త నియంత్రణ అలవాటుగా ఉండాలని ఎమ్మె ల్యే మామిడి గోవిందరావు సూచించారు. బూర గాం గ్రామంలో బుధవారం జరిగిన స్వచ్ఛ పథం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రత అభివృద్ధికి కొలమానమ న్నారు. అనంతరం ప్రధాన రహదారులపై పారిశు ధ్యంపై అవగాహన కల్పిస్తూ ఫ్లెక్సీ ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మండల పరి షత్, సచివాలయ అధికారులతోపాటు కూటమి నాయకులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. అ లాగే మండల పరిధిలోని కాగువాడ గ్రామంలో జరిగిన శ్రీచెవిటమ్మతల్లి ఆలయ పునఃప్రతిష్ఠా కా ర్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆలయ అభివృ ద్ధికి రూ.50వేలు విరాళాన్ని అందజేశారు. అలాగే హిరమండలం మండల తుంగతంపరలో నీలమణి దుర్గ ఆలయ ప్రతిష్ఠోవాల్లో పాల్గొని ఆలయ అభివృద్ధికి రూ.20వేలు విరాళాన్ని అందజేశారు.