Share News

100 బస్తాల యూరియా స్వాధీనం

ABN , Publish Date - Oct 05 , 2026 | 11:55 PM

Illegal transport of urea from Odisha ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న 100 బస్తాల యూరియాను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు పట్టుబడింది. యూరియా అక్రమ రవాణాపై అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సోమవారం వ్యవసాయశాఖ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చల్లవానిపేట కూడలిలో సోమవారం ఉదయం తనిఖీ చేశారు.

100 బస్తాల యూరియా స్వాధీనం
చల్లవానిపేట వద్ద విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న యూరియా బస్తాలు

ఒడిశా నుంచి అక్రమ రవాణా

జలుమూరు, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న 100 బస్తాల యూరియాను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు పట్టుబడింది. యూరియా అక్రమ రవాణాపై అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సోమవారం వ్యవసాయశాఖ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చల్లవానిపేట కూడలిలో సోమవారం ఉదయం తనిఖీ చేశారు. ఒడిశా నుంచి వస్తున్న టాటామేజిక్‌ లగేజీ వ్యాన్‌లో 100 యూరియా బస్తాలు పట్టుబడ్డాయి. పోలాకి మండలం డోల గ్రామానికి చెందిన డోల రమణమూర్తి ఎటువంటి అనుమతి లేకుండా ఈ యూరియాను తరలిస్తున్నట్టు గుర్తించారు. ఈ మేరకు ఆయనపై 6ఏ కేసు నమోదు చేశామని వ్యవసాయశాఖ అధికారి కె.రవికుమార్‌ తెలిపారు. స్వాధీనం చేసుకున్న యూరియా బస్తాలను చల్లవానిపేట సొసైటీకి అప్పగించామన్నారు. టాటా మేజిక్‌ లగేజీ వ్యాన్‌ని సీజ్‌ చేసి జలుమూరు పోలీసుస్టేషన్‌కు తరలించామని తెలిపారు. దాడుల్లో విజిలెన్సు ఎన్‌ఫోర్సుమెంటు ఎస్‌.ఐ బి.రామారావు, సిబ్బంది, వ్యవసాయ సహాయకులు సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2026 | 11:55 PM