Share News

We should come forward to establish industries.

ABN , Publish Date - Jul 05 , 2026 | 11:56 PM

జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకురావాలని కేంద్రమంత్రి కింజారాపు రామ్మెహనానాయుడు పిలుపునిచ్చారు.

 We should come forward to establish industries.
తెల్లవానిపేటలో పర్యటిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు:

పోలాకి, జూలై 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకురావాలని కేంద్రమంత్రి కింజారాపు రామ్మెహనానాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం రాళ్లపాడులో సీసీరోడ్డు, ప్రయాణికుల విశ్రాంతి భవనం, తెల్లవానిపేట, బార్జిపాడు ఎస్‌సీకాలనీ, రహిమాన్‌పురం రహదారి పనులను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చనతో ప్రారంభించారు. అనంతరం అంబీరుపేటలో శిథిలావస్థలోఉన్న కాలనీ ఇళ్లను కేంద్రమంత్రి పరిశీలించి, పక్కాఇళ్ల నిర్మాణానికి నిధుల మంజూరు కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, తెలుగుయువత అధ్యక్షులు మెండదాసునాయుడు, పీఆర్‌ డీఈ ఈ నాయుడు, తహసీల్దార్‌ పి.శ్రీనివాసరావు, ఎంపీడీవో రవికుమార్‌ పాల్గొన్నారు. ఉరజాంలో రూ. ఏడు కోట్ల వ్యయంతో మంజూరైన అభివృద్ధిపనులను ప్రారంభించారు.

Updated Date - Jul 05 , 2026 | 11:56 PM