పాడి పరిశ్రమ అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం:ఎమ్మెల్యే బగ్గు
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:52 PM
పాడి పరిశ్రమ అభివృధ్దే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. బురదకొత్తూరులో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
జలుమూరు (సారవకోట), జూలై 14 (ఆంధ్రజ్యోతి) పాడి పరిశ్రమ అభివృధ్దే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. బురదకొత్తూరులో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు అనుబంధ సంస్థలను లాభసాటిగా మార్చేందుకు... గ్రామీణ స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు రాయితీలను అమలు చేస్తోందన్నారు. అనంతరం పశు దాణా ప్యాకెట్లను రైతులకు పంపిణీ చేశారు. బురదకొత్తూరులో పాఠశాల అదనపు తరగతి గది, ప్రహరీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ తర్ర బలరాం, ఉపాధ్యక్షులు డి.వెంకటరమణ, సారవకోట సొసైటీ అధ్యక్షుడు సురవరపు తిరుపతిరావు, పశుసంవర్దకశాఖ ఏడీ మంద లోకనాథం, టీడీపీ నాయకులు రత్నాలు నాయుడు, సాధు కృష్ణారావు, మూకళ్ల చిన్నయ్య, పట్ట ఉమామహేశ్వరరావు, మురళీధర్, తదితరులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి
రైతుల సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు పనిచేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు మార్కెట్ కమిటీ కార్యాలయానికి ప్రహరీ నిర్మాణానికి, గొదాం నిర్మాణానికి, కార్యాలయంపై మార్కెట్ కమిటీ అధ్యక్షులకు ప్రత్యేక గది నిర్మాణానికి రూ.1.50 కోట్ల మంజూరుకు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ అధ్యక్షులు తర్ర బలరాం, ఉపాధ్యక్షులు డొక్కా వెంకటరమణ, చల్లవానిపేట సొసైటీ అధ్యక్షులు దుంగ స్వామిబాబు తదితరులు పాల్గొన్నారు.