21 నుంచి రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు
ABN , Publish Date - Aug 03 , 2026 | 11:57 PM
శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి తైక్వాండో చాంపియన్ షిప్ పోటీల పోస్టర్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు ఆవిష్కరిం చారు.
పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం స్పోర్ట్స్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి తైక్వాండో చాంపియన్ షిప్ పోటీల పోస్టర్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు ఆవిష్కరిం చారు. సోమవారం నిమ్మాడలోని తన క్యాంపు కార్యాల యంలో సంఘం ప్రతినిధులు ఆయ నను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ.. జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మక పోటీలు నిర్వహించడం అభినంద నీయమన్నారు. క్రీడా స్ఫూర్తితో వ్యవహరించి రాణించాలన్నారు. ఈ పోటీలు ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు ఏడు రోడ్ల జంక్షన్‌లోని వైఎస్‌ఆర్ మున్సిపల్ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు అసోసి యేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమర భాస్కర రావు పేర్కొన్నారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తం గా అన్ని జిల్లాల నుంచి క్రీడా కారులు పాల్గొం టారన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతి నిధులు పి.శ్రీను, సుధీర్ పాల్గొన్నారు.