మూడు ప్రాంతాల్లో శ్రీ సిమెంట్స్ పెట్టుబడులు
ABN , Publish Date - Oct 07 , 2026 | 05:20 AM
రాష్ట్రంలో తమ పెట్టుబడులను మరింత విస్తరించేందుకు శ్రీ సిమెంట్స్ కంపెనీ ముందుకువచ్చిందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ తెలిపారు.
విశాఖపట్నం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తమ పెట్టుబడులను మరింత విస్తరించేందుకు శ్రీ సిమెంట్స్ కంపెనీ ముందుకువచ్చిందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ తెలిపారు. శ్రీ సిమెంట్స్ ప్రతినిధులతో విశాఖపట్నంలో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో రూ.6,700 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు శ్రీ సిమెంట్స్ ఆసక్తి చూపుతోందన్నారు. అనకాపల్లి, కడప, పల్నాడుల్లో ఆ సంస్థ పెట్టుబడులు పెడుతుందన్నారు. దీనివల్ల సుమారు 3వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో శ్రీసిమెంట్స్ వైస్ చైర్మన్ ప్రశాంత్ బాబు, కార్పొరేట్ అఫైర్స్ ప్రెసిడెంట్ గౌరవ్ జైన్ ఉన్నారు.
ఈ వార్తలనూ చదవండి..
అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!