‘జీవో 7 గడువు పొడిగించాలి’
ABN , Publish Date - Oct 10 , 2026 | 06:19 AM
ఏపీఐఐసీ పారిశ్రామికవాడల్లో దళిత పారిశ్రామికవేత్తలకు సంబంధించిన జీవో నంబర్ 7 గడువును పొడిగించాలని ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది.
ఏపీఐఐసీ పారిశ్రామికవాడల్లో దళిత పారిశ్రామికవేత్తలకు సంబంధించిన జీవో నంబర్ 7 గడువును పొడిగించాలని ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. ఈమేరకు జేఏసీ చైర్మన్ ఇ.అనార్‌బాబు శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌కు, ఆ శాఖ ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు తమ ప్లాట్‌లకు నగదు చెల్లించేందుకు ప్రభుత్వం నెల రోజులు మాత్రమే సమయం ఇచ్చిందని తెలిపారు. ఈనెల 10వ తేదీతో గడువు ముగుస్తున్నందున ప్లాట్లను రద్దు చేయవద్దని, ప్రభుత్వం పెద్ద మనసుతో మరొక అవకాశం ఇవ్వాలని కోరారు.
ఈ వార్తలనూ చదవండి:
సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు