తుఫాన్ బాధితులకు ఎస్‌బీఐ సాయం.. సీఎం సహాయ నిధికి రూ.5.01 కోట్లు
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:46 PM
ఆర్బన్ తుఫాన్‌తో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలిచేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ముందుకొచ్చింది. ప్రకృతి విపత్తు కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంతో పాటు రాష్ట్రంలో సహాయక చర్యలకు తోడ్పాటు అందించేందుకు తనవంతు సహాయాన్ని ప్రకటించింది.
అమరావతి, అక్టోబర్ 31: తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలిచేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ముందుకొచ్చింది. ప్రకృతి విపత్తు కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంతో పాటు రాష్ట్రంలో సహాయక చర్యలకు తోడ్పాటు అందించేందుకు తనవంతు సహాయాన్ని ప్రకటించింది.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్ల 1 లక్ష రూపాయల భారీ విరాళాన్ని అందించింది. తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు ఎస్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవడం, సామాజిక బాధ్యతలో భాగంగా సహాయం అందించడం అభినందనీయమని పేర్కొంటున్నారు.
ఈ మేరకు ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అమర రామ్మోహన్ రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన రూ.5.01 కోట్ల విరాళం చెక్కును చంద్రబాబుకు అందజేశారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ఉదారంగా విరాళం అందించిన ఎస్‌బీఐ యాజమాన్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బాధితులకు సహాయం అందించేందుకు ముందుకొచ్చిన బ్యాంకు ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ అమరావతి సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల్ కుమార్, జనరల్ మేనేజర్ కుందన్ జ్యోతి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ షేక్ షమీన్ భానుతో పాటు ఇతర బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.