Share News

‘సంతూర్‌’ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - Oct 07 , 2026 | 05:05 AM

సంతూర్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రాం 2026-27కు రాష్ట్రంలో ఆర్ధికంగా వెనుకబడిన అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్ధునులు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ ప్రతినిధులు పి.ఎస్.నారాయణ్‌, నీరజ్‌ ఖత్రి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

‘సంతూర్‌’ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

విజయవాడ, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): సంతూర్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రాం 2026-27కు రాష్ట్రంలో ఆర్ధికంగా వెనుకబడిన అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్ధునులు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ ప్రతినిధులు పి.ఎస్.నారాయణ్‌, నీరజ్‌ ఖత్రి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన 500 మంది విద్యార్థినులకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.30 వేలు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఈ నెల 15వ తేదీ లోపుగా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు www.santoorscholarships.com సంప్రదించాలని సూచించారు. గడిచిన పదేళ్లలో దేశవ్యాప్తంగా 10 వేల మందికి పైగా విద్యార్ధినులకు స్కాలర్‌షిప్‌లు అందించినట్టు వివరించారు.

ఈ వార్తలనూ చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!

Updated Date - Oct 07 , 2026 | 05:05 AM