Share News

కారు అద్దాలు పగులకొట్టి.. అందులోని వారిని కొట్టి

ABN , Publish Date - Sep 27 , 2026 | 05:07 AM

దుండగులు ఓ కారు అద్దాలను పగులకొట్టి, కారులోని వారి పై దాడి చేసి భారీగా నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి విశాఖపట్నంలో జరిగింది.

 కారు అద్దాలు పగులకొట్టి.. అందులోని వారిని కొట్టి

  • 71.2 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

  • 10 తులాల బంగారం కూడా దోపిడీ

  • విశాఖలో ఘటన, కేసు నమోదు

సీతంపేట(విశాఖపట్నం), సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): దుండగులు ఓ కారు అద్దాలను పగులకొట్టి, కారులోని వారి పై దాడి చేసి భారీగా నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి విశాఖపట్నంలో జరిగింది. ద్వారకానగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. ఎన్‌ఏడీ జంక్షన్‌ సమీపాన గల బుచ్చిరాజుపాలెం ప్రాంతానికి చెందిన కొణతాల రమేశ్‌ ట్రేడింగ్‌, మార్కెటింగ్‌ వ్యాపారం చేస్తుంటారు. ఆయనకు ఆన్‌లైన్‌లో రాజు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఇండియన్‌ కరెన్సీ ఇస్తే దానికి బదులుగా తాను డాలర్లు ఇస్తానని రాజు చెప్పాడు. అతని సూచన ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి రమేశ్‌, ఆయన భార్య, పిల్లలు, స్నేహితుడు డి.రమేశ్‌తో కలిసి కారులో రూ. 71.2 లక్షల నగదుతో ద్వారకానగర్‌లోని డైమండ్‌ పార్కు వద్ద గల బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వద్దకు చేరుకున్నారు. అక్కడకు తమను రాజు పంపించాడంటూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. రమేశ్‌కు అనుమానం వచ్చి కారు దిగలేదు. అయితే వారు కారు అద్దాలు పగులకొట్టి, కారులోని వారందరినీ కొట్టి నగదుతో పాటు 10 తులాల బంగారం దోచుకుపోయారు. దీంతో కొణతాల రమేశ్‌ ద్వారకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ఉమామహేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు ద్వారకా క్రైమ్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ వార్తలనూ చదవండి:

మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

పర్యాటకం జోరు

Updated Date - Sep 27 , 2026 | 05:07 AM