ఆర్టీజీఎస్ పనితీరు భేష్
ABN , Publish Date - Oct 10 , 2026 | 06:09 AM
ఏపీ రియల్‌టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) పనితీరు బాగుందని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ కుమార్ నారాయణ ప్రశంసించారు శుక్రవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు.
రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ ప్రశంస
అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఏపీ రియల్‌టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) పనితీరు బాగుందని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ కుమార్ నారాయణ ప్రశంసించారు శుక్రవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఆర్టీజీఎస్ పనితీరు గురించి సీఈవో ప్రఖర్‌జైన్ ఆయనకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల సమాచారాన్ని డేటా లేక్ విధానం ద్వారా సమీకరించి.. నిక్షిప్తం చేయడాన్ని మృత్యుంజయకుమార్ అభినందించారు. ఆర్టీజీఎస్ మనమిత్ర-వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలన్నింటినీ ఆన్‌లైన్‌లోనే అందిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ సేవలను సులువుగా పౌరులకు అందించడాన్ని మృత్యుంజయకుమార్ ప్రశంసించారు.
ఈ వార్తలనూ చదవండి:
సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు