Share News

ముగిసిన జడ్పీ పాలకవర్గ పదవీకాలం

ABN , Publish Date - Sep 25 , 2026 | 03:02 AM

జిల్లా పరిషత్‌ పాలకవర్గ పదవీకాలం గురువారంతో ముగిసింది. 2021 సెప్టెంబరు 25న చైర్‌పర్సన్‌గా బూచేపల్లి వెంకాయమ్మ బాధ్యతలు స్వీకరించారు. ఆమె పదవీకాలం గురువారం ముగియడంతో శుక్రవారం నుంచి జడ్పీ ప్రత్యేక అధికారి పాలనలోకి రానుంది.

ముగిసిన జడ్పీ పాలకవర్గ పదవీకాలం

నేటి నుంచి ప్రత్యేకాధికారి పాలన

మండలాల్లో బాధ్యతలు స్వీకరించిన స్పెషల్‌ ఆఫీసర్లు

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 24 (ఆంధ్ర జ్యోతి): జిల్లా పరిషత్‌ పాలకవర్గ పదవీకాలం గురువారంతో ముగిసింది. 2021 సెప్టెంబరు 25న చైర్‌పర్సన్‌గా బూచేపల్లి వెంకాయమ్మ బాధ్యతలు స్వీకరించారు. ఆమె పదవీకాలం గురువారం ముగియడంతో శుక్రవారం నుంచి జడ్పీ ప్రత్యేక అధికారి పాలనలోకి రానుంది. ఇప్పటికే ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ రాజాబాబును నియమించారు. తదనుగుణంగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. మండల పరిషత్‌ పాలకవర్గాల గడువు బుధవారంతో ముగియడంతో వాటికి జిల్లా, డివిజనల్‌ స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. గురువారం వారు బాధ్యతలు స్వీకరించారు. దీంతో పాలకవర్గాల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. ఇక అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వేగవంతం కానుంది. ఇప్పటివరకు జడ్పీటీసీలు, మెజారిటీ మండల పరిషత్‌ అధ్యక్షులు వైసీపీకి చెందిన వారు కావడంతో పలు అభివృద్ధి పనులకు తీర్మానాలు చేయకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు పాలకవర్గాల గడువు ముగియడంతో ఆయా మండలాల్లో చేపట్టే అభివృద్ధి పనులతోపాటు సంక్షేమ పథకాల అమలు వేగవంతం కానుంది.

Updated Date - Sep 25 , 2026 | 03:02 AM