అద్దంకిలో వైసీపీ నేతల హడావుడి..
ABN , Publish Date - Oct 21 , 2026 | 11:31 PM
అద్దంకి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుండగా వైసీపీ నాయకులు ఏదో ఒక విధంగా రాద్ధాంతం చేసి అలజడి సృష్టించాలనే ధ్యేయంతో ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. నామినేషన్ పత్రాల పరిశీలన, ఉపసంహరణల సమయంలో చోటుచేసుకున్న సంఘటనలు వైసీపీ నేతల తీరుకు అద్దం పడుతున్నాయి.
నామినేషన్ ఉపసంహరణ సందర్భంగా కేంద్రంలో ప్రవేశించేందుకు యత్నించిన ఇన్‌చార్జి డాక్టర్ అశోక్‌కుమార్
అడ్డుకున్న పోలీస్ అధికారులు
అద్దంకి, అక్టోబరు21(ఆంధ్రజ్యోతి) : అద్దంకి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుండగా వైసీపీ నాయకులు ఏదో ఒక విధంగా రాద్ధాంతం చేసి అలజడి సృష్టించాలనే ధ్యేయంతో ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. నామినేషన్ పత్రాల పరిశీలన, ఉపసంహరణల సమయంలో చోటుచేసుకున్న సంఘటనలు వైసీపీ నేతల తీరుకు అద్దం పడుతున్నాయి. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా 32వ వార్డు నుంచి వైసీపీ తరఫున పోటీచేసిన ఆలకుంట విజయరామరాజు, స్వతంత్ర అభ్యర్థి విజయరామరాజు భార్య ఆలకుంట హైమావ తిలు తమ అభ్యర్థిత్వాలను ప్రతిపాదించిన వ్యక్తుల ద్వారా నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో టీడీపీ తరఫున పోటీచేసిన బండారు వెంకటరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల లోపలకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అలా వెళ్లటానికి వీల్లేదని సీఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు వైసీపీ నేతలు నానా హడావుడి సృష్టించారు. నామినేషన్ పత్రాల పరిశీలన సమయంలో 1వ వార్డు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన కొత్తగొర్ల వెంకటసుబ్బారావు, షేక్ కరిముల్లాల నామినేషన్ పత్రాలలో లోపాలు ఉండటంతో తిరస్కరణకు గురయ్యాయి. దీంతో సోమవారం నామినేషన్ పత్రాల పరిశీలన జరిగే మున్సిపల్ కార్యాలయంలోకి ఇన్‌చార్జి అశోక్‌కుమార్ వైసీపీ కార్యకర్తలతో కలిసి వెళ్లి నానా హడావుడి చేశారు. ఓ అధికారి పట్ల ఒకింత కఠినంగా మాట్లాడినట్లు తెలుస్తుంది. వైసీపీ నేతలు ఎదో ఒక విధంగా హడావుడి చేసే ప్రయత్నం చేయటంపై పలువురు విమర్శిస్తున్నారు.