టీడీపీలో చేరిన వలేటివారిపాలెం వైసీపీ నాయకులు
ABN , Publish Date - Nov 17 , 2026 | 11:04 PM
ఒంగోలు మండలంలోని వలేటివారిపాలేనికి చెందిన పలువురు వైసీపీ నాయకులు మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వారికి పార్టీ జెండాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఒంగోలు కార్పొరేషన్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని వలేటివారిపాలేనికి చెందిన పలువురు వైసీపీ నాయకులు మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వారికి పార్టీ జెండాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు. గతంలో వైసీపీలో ఉండి ఆ గ్రామానికి చెందిన వార్డ్ మాజీ మెంబర్ కోటపూరి చిరంజీవి, గొట్టిపాటి సురేష్, ఎద్దు ఏసుపాదం, ఎద్దు శెల్వరాజ్, మట్టిపల్లి శేఖర్‌బాబు, దానం హరిబాబు, మైలవరపు సురేష్, నల్లపోతుల రాము, శ్రావణిడేవిడ్‌రాజు, పలువురు తెలుగుదేశం పార్టీలో చేరగా, టీడీపీ మండల క్లస్టర్ కన్వీనర్ నల్లమోతు బాలగంగాధర్, పాతూరి పూర్ణ, మండల తెలుగు యువత అధ్యక్షుడు వలేటి రాంబాబు పాల్గొన్నారు.