Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:21 PM

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం వేకువజామున సంతనూతలపాడులో చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

సంతనూతలపాడు, జూలై 12(ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం వేకువజామున సంతనూతలపాడులో చోటుచేసుకుంది. ఎస్సై వి.అజయ్‌బాబు తెలిపిన వివరాల మేరకు... సంతనూతలపాడు అంబేద్కర్‌నగర్‌కు చెందిన కనపర్తి క్రాంతికుమార్‌(20) బేల్దారీ పనులు చేస్తుంటాడు. కొత్త బైక్‌ కొని ఆదివారం వేకువజామున సంతనూతలపాడులో ఉన్న అతని బాబాయ్‌ ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో అతివేగంగా వస్తూ పెదగచ్చుల వద్ద చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణం వద్ద ప్రమాదానికి గురై తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఎవరో యువకుడు మృతి చెందాడన్న వార్త తెలుసుకున్న స్థానికులతో పాటు అంబేద్కర్‌గనర్‌వాసులు వచ్చి చూడగా మృతి చెందిన యువకుడు సంతనూతలపాడు అంబేద్కర్‌నగర్‌కు చెందిన మృతుడు కనపర్తి క్రాంత్రికుమార్‌గా గుర్తించారు. మృతుడు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వి.అజయ్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.


కారు చెట్టుకు ఢీకొని ఒకరు మృతి

బేస్తవారపేట, జూలై 12 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని బేస్తవారపేట, చిన్న కంభం రోడ్డులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చెట్టిచెర్ల గ్రామానికి చెందిన ఎం.గురుస్వామి (45) మృతి చెందారు. కంభం మండలం తురిమెళ్ల గ్రామం నుంచి స్వగ్రామం చెట్టిచర్ల గ్రామానికి కారు నడుపుకుంటు వస్తుండగా చిన్న కంభం - బేస్తవారపేట రోడ్డులో కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన గురుస్వామిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

Updated Date - Jul 12 , 2026 | 11:21 PM