Share News

బైకు అదుపుతప్పి యువకుడు మృతి

ABN , Publish Date - Aug 11 , 2026 | 11:15 PM

బైక్‌ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం సోమవారం రాత్రి జరిగింది.

బైకు అదుపుతప్పి యువకుడు మృతి

ఎర్రగొండపాలెం రూరల్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): బైక్‌ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన సుంకరి పవన్‌కుమార్‌ (30) పనుల నిమిత్తం వై పాలెం వచ్చి తిరిగి వెళ్తుండగా వీరభద్రాపురం - వెంకటాద్రిపాలెం మధ్యలో బైక్‌ అదుపు తప్పి పక్కనున్న చెట్టును ఢీకొట్టాడు. రాత్రి సమయం కావడంతో ఎవరూ గమనించలేదు. బైక్‌ లైట్లు చూసిన పక్క పొలాల రైతులు 108కు సమాచారం ఇచ్చారు. 108లో వపన్‌ను ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలో మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై దేవకుమార్‌ మంగళవారం తెలిపారు.

Updated Date - Aug 11 , 2026 | 11:15 PM