గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి
ABN , Publish Date - Jul 15 , 2026 | 11:10 PM
ముండ్లమూరు సబ్‌స్టేషన్ వద్ద అద్దంకి - దర్శి రహదారిపై బుధవారం రాత్రి 8గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని పులిపాడుకు చెందిన గంగవరపు ఖాసింబాబు(19) అక్కడికక్కడే మృతిచెందాడు.
మృతుడు పులిపాడుకు చెందిన వాసి
ముండ్లమూరు, జూలై 15 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సబ్‌స్టేషన్ వద్ద అద్దంకి - దర్శి రహదారిపై బుధవారం రాత్రి 8గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని పులిపాడుకు చెందిన గంగవరపు ఖాసింబాబు(19) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు ముండ్లమూరులో బార్బర్ షాపు నడుపుతున్నాడు. ద్విచక్రవాహనంపై స్వగ్రామమైన పులిపాడుకు వెళుతూ సబ్‌స్టేషన్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని ఎస్సై కోటేశ్వరరావు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.