కారు ఢీకొని యువకుడు మృతి
ABN , Publish Date - Oct 05 , 2026 | 10:58 PM
:మోటార్ సైకిల్‌ను కారు ఢీకొని యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
మద్దిపాడు, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి):మోటార్ సైకిల్‌ను కారు ఢీకొని యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం రాత్రి సీతారాంపురం కొస్టాలు వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు మద్దిపాడు దాసరి కాలనీకి చెందిన మొండ్రు బద్రి(19), శాంతకుమార్‌లు మోటార్ సైకిల్‌పై కొస్టాలు సెంటర్ దగ్గర యూటర్న్ తీసుకుంటుండగా గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో మొండ్రు బద్రి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అలాగే తీవ్ర గాయాలయిన శాంతకుమార్‌ను హైవే ఆంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.