Share News

చదువుకోన్విలేదని ఆత్మహత్యకు పాల్పడిన యువతి

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:49 PM

చదువుకుంటానంటే తల్లిదండ్రులు వద్దన్నందుకు ఓ యువతి ఎలుకలు మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది.

చదువుకోన్విలేదని ఆత్మహత్యకు పాల్పడిన యువతి

ఒంగోలు క్రైం, జనవరి 20(ఆంధ్రజ్యోతి) : చదువుకుంటానంటే తల్లిదండ్రులు వద్దన్నందుకు ఓ యువతి ఎలుకలు మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలలోకి వెళితే... స్థానిక గోపాల్‌నగరంలో నివాసం ఉంటున్న బొజ్జా సౌజన్య(21) ఈ నెల 15న ఎలుకల మందును కూల్‌ డ్రింక్‌ కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకుంది. పదో తరగతి కూడా మధ్యలోనే చదువు ఆపివేసింది. తల్లిదండ్రులతో ఎన్నిమార్లు చెప్పినా పెండ్లి వయస్సు వచ్చిందని చెప్పి చదువుకు వెళ్లనీయలేదు. అదేక్రమంలో సంక్రాంతి పండుగకు ఇళ్లకు వచ్చిన వారు మధ్యలో చదువు ఎందుకు ఆపివేశావని అడగడంతో మనస్తాపం చెంది ఎలుకల మందు తిన్నట్లు పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అప్పటి నుంచి ఒంగోలులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఈ మేరకు ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

గుడ్లూరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన మండలంలోని చేవూరు సమీపంలో అటవీప్రాంతంలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 60 నుండి 65 సంవత్సరాల వయసుకలిగిన ఎరుపురంగు నిక్కరు మాత్రమే ధరించిన వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వ్యక్తికి సంబంధించి ఎలాంటి ఆధారాలు వెలుగులోనికి రాకపోవడంతో గుర్తుతెలియని మృతదేహంగా పోలీసులు నిర్ధారించారు. చేవూరు నుంచి అడవిలక్ష్మిపురం వైపు వెల్లే దారిలోని, అడవిప్రాంతంలో ఈ మృతదేహం ఉండడాన్ని తొలుత పశువులకాపరులు కొందరు గుర్తించారు. అనంతరం గుడ్లూరు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదుచేసి, సమగ్రదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు.

Updated Date - Jan 20 , 2026 | 11:49 PM