Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:05 AM

ముం దు వెళుతున్న కట్టెల లారీని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు మరణించగా, డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అ య్యాయి. ఈ సంఘటన టం గుటూరు మం డలం తూ ర్పునాయుడుపా లెం వద్ద గల జాతీయ రహదారిపై జరిగింది.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ముందు వెళ్తున్న కట్టెల లారీని ఢీకొన్న కారు

మరొకరికి స్వల్ప గాయాలు

తూర్పునాయుడుపాలెం(కొండపి), మా ర్చి3 (ఆంధ్రజ్యోతి): ముం దు వెళుతున్న కట్టెల లారీని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు మరణించగా, డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అ య్యాయి. ఈ సంఘటన టం గుటూరు మం డలం తూ ర్పునాయుడుపా లెం వద్ద గల జాతీయ రహదారిపై జరిగింది. ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం గ్రామానికి చెందిన ఐదుగురు స్నేహితులు చెన్నయ్‌కి కారులో బయలుదేరారు. తూర్పునాయుడుపాలెం వచ్చేసరికి ముందు వెళుతున్న కట్టెల లారీని కారు వేగంగా ఢీకొంది. కారు ముందు భాగంలో కూర్చున్న షేక్‌ అబ్దుల్లా(27) తలకు గాయాలై అక్కడికక్కడే మరణించాడు. మరో వ్యక్తి దుర్గాప్రసాద్‌ సీట్ల మధ్య ఒత్తుకుని గాయపడ్డాడు. డ్రైవింగ్‌ చేస్తున్న సీతారామయ్య, మరో ఇద్దరు సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. కారు ముందు భాగంగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.

Updated Date - Mar 04 , 2026 | 12:05 AM