సమయపాలన పాటించాల్సిందే!
ABN , Publish Date - Jun 07 , 2026 | 02:37 AM
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో డాక్టర్ టి.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో శనివారం వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
లేకుంటే వైద్యాధికారులు, సిబ్బందిపై చర్యలు
డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వర్లు హెచ్చరిక
ఒంగోలు కలెక్టరేట్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో డాక్టర్ టి.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో శనివారం వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది తప్పనిసరిగా ప్రతిరోజూ ముఖహాజరు వేయాల్సిందేనని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. ఆయా వైద్యశాలల పరిధిలో గర్భిణులను గుర్తించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. పీహెచ్‌సీలో ప్రతినెలా 10వతేదీ గర్భిణులను వైద్యాధికారులు పరీక్షించాలన్నారు. వారికి ఆరోగ్య సలహాలు ఇవ్వాలన్నారు. జిల్లాలో మాతృ, శిశుమర ణాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఆరోగ్య సిబ్బందిపై ఉందన్నారు. ప్రతి కాన్పు ప్రభుత్వ వైద్యశాలలోనే జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయాలన్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున వడదెబ్బ బారిన పడిన వారికి అవసరమైన చికిత్సను అందించేందుకు పీహెచ్‌సీల్లో ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ బాలాజీ, కమలశ్రీ, భగీరథి, డాక్టర్ శ్రావణ్, ఏవో ప్రసాద్, జిల్లా డేటా మేనేజర్ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా మలేరియా అధికారి మధుసూదన్‌రావు, జిల్లా డెమో అధికారి బెల్లం నరసింహారావు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.