Share News

రామాయపట్నం పోర్టుపై వైసీపీ విషప్రచారం

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:54 PM

రామాయపట్నం పోర్టు ద్వారా 25వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంటే, దానిని అడ్డుకునేందుకు వైసీపీ విష ప్రచారం చేస్తోందని మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య ధ్వజమెత్తారు.

రామాయపట్నం పోర్టుపై వైసీపీ విషప్రచారం
మాట్లాడుతున్న మారిటైం బోర్డు చైర్మన్‌ సత్య

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రపూరిత రాతలు

మీడియా సమావేశంలో మారిటైం బోర్డు ఛైర్మన్‌ దామచర్ల సత్య వెల్లడి

ఒంగోలు కార్పొరేషన్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : రామాయపట్నం పోర్టు ద్వారా 25వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంటే, దానిని అడ్డుకునేందుకు వైసీపీ విష ప్రచారం చేస్తోందని మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య ధ్వజమెత్తారు. శుక్రవారం ఒంగోలులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామాయపట్నం పోర్టుపై సాక్షి పత్రిక ప్రచురించిన కథనం అవాస్తమన్నారు. అలాగే అసత్య వార్తలు రాసినందుకు ఆ పత్రికపై పరువునష్టం దావా వేయనున్నట్లు వెల్లడించారు. రామాయపట్నం పోర్టు ద్వారా తీర ప్రాంతం అభివృద్ధి,దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. యువతకు ఉద్యోగాలు రాకూడదని సాక్షి కక్షపూరితంగా వ్యవహరిస్తూ అసత్య ప్రచారాలు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పలు కంపెనీలు భారీ పెట్టుబడులు పెడుతుంటే జీర్ణించుకోలేని వైసీపీ.. ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని లక్షల కోట్లు అప్పుల్లో ముంచేసి ఇప్పుడు అభివృద్ధిపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమర్థవంతమైన పాలనతో రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిరాధారమైన ఆరోపణలు చేయడం ఆ పార్టీ నైజమని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షం ప్రజా ప్రయోజనాల కోసం మంచి సూచనలు చేస్తే స్వాగతిస్తామని, కానీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు. గత ఎన్నికల్లో ప్రజలువైసీపీని 11 స్థానాలకు పరిమితం చేసినా ఇంకా ఇదే ధోరణి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో మరింత ఘోరంగా పరాజయం తప్పదని సత్య స్పష్టం చేశారు.

Updated Date - Jul 17 , 2026 | 11:54 PM