Share News

జువ్వలదిన్నె హార్బర్‌పై వైసీపీ నీచరాజకీయం

ABN , Publish Date - Apr 14 , 2026 | 02:45 AM

జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బ ర్‌పై వైసీపీ నీచ రాజకీయం చేస్తు న్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజ నేయస్వామి విమర్శించారు. మంగళ వారం నెల్లూరు జిల్లాకు జగన్‌ ఎందుకు వెళ్తున్నాడో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

జువ్వలదిన్నె హార్బర్‌పై వైసీపీ నీచరాజకీయం

మంత్రి డాక్టర్‌ బాలవీరాంజనేయస్వామి విమర్శ

నేడు జగన్‌ నెల్లూరు పర్యటన ఎందుకో చెప్పాలని ప్రశ్న

పోర్టులను అడ్డుకున్న పాపం వైసీపీదేనని ధ్వజం

తూర్పునాయుడుపాలెం (కొండపి), ఏప్రిల్‌ 13 (ఆంధ్ర జ్యోతి): జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బ ర్‌పై వైసీపీ నీచ రాజకీయం చేస్తు న్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజ నేయస్వామి విమర్శించారు. మంగళ వారం నెల్లూరు జిల్లాకు జగన్‌ ఎందుకు వెళ్తున్నాడో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. జువ్వలదిన్నెలో అటానమస్‌ మారిటైం షిప్‌ యార్డ్‌, సిస్టమ్స్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. తద్వారా దేశంలోనే తొలి అటానమస్‌ మారిటైం షిప్‌ యార్డ్‌గా జువ్వలదిన్నె అభివృద్ధి చెందబోతున్నదని మంత్రి పేర్కొన్నారు. దేశీయ రక్షణ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడం, దేశ సముద్ర సాంకేతిక సామర్థ్యాల అభివృద్ధికి రూ.45కోట్ల పెట్టుబడితో వెయ్యి మందికి ఉద్యోగాలు రానున్నాయన్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను రూ.288.80 కోట్ల పెట్టుబడితో ఇప్పటికే అభివృద్ధి చేశామన్నారు. ఈ హార్బర్‌లో ల్యాండింగ్‌ ప్లాట్‌ఫాంలు, వేలం హాళ్లు, వలల మరమ్మతు యార్డులు, అంతర్గత రహదారులు, విద్యుత్‌, తాగునీటి సదుపాయాలతో, ఆధునిక మౌలిక వసతులను కల్పించామని చెప్పారు. నాడు అడ్డగోలు జీవోలిచ్చి కృష్ణపట్నం పోర్టు అభివృద్ధిని వైఎస్‌ అడ్డుకున్నారన్నారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ఆ జీవోలను రద్దుచేసి పోర్టు అభివృద్ధికి మార్గం సుగమం చేశారని మంత్రి స్వామి గుర్తుచేశారు. మత్స్యకారుల సంక్షేమానికి, అభివృద్దికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. నేడు నెల్లూరు జగన్‌ ఎందుకు వస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యే స్థానాలు 11కి పడిపోయినా జగన్‌ నీచ రాజకీయాలు మానుకోవడం లేదని మంత్రి స్వామి దుయ్యబట్టారు.

Updated Date - Apr 14 , 2026 | 02:45 AM