వైసీపీ టంగుటూరు మండల అధ్యక్షుడు హరిబాబును అరెస్టు చేయాలివైసీపీ టంగుటూరు మండల అధ్యక్షుడు హరిబాబును అరెస్టు చేయాలి
ABN , Publish Date - Feb 23 , 2026 | 10:42 PM
టంగుటూరు మండల వైసీపీ అధ్యక్షుడు చింతపల్లి హరిబాబును వెంటనే అరెస్టు చేయాలని రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తుల్లిబల్లి అశోక్ డిమాండ్ చేశారు.
ఒంగోలు కలెక్టరేట్,ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : టంగుటూరు మండల వైసీపీ అధ్యక్షుడు చింతపల్లి హరిబాబును వెంటనే అరెస్టు చేయాలని రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తుల్లిబల్లి అశోక్ డిమాండ్ చేశారు. స్థానిక అంబేద్కర్ భవన్‌లో సోమవారం మాలల జేఏసీ, మాలల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లడుతూ దళితులపై దాడి జరిగినా మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. డాక్టర్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లను ఉపయోగించి పదవులు పొందిన వారు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. అవసరమైతే రాష్ట్ర ఎస్సీ కమిషన్, హోంశాఖ, హైకోర్టును ఆశ్రయించి చర్యలు తీసుకొనే విధంగా ముందుకు పోతామని చెప్పారు. జేఏసీ జిల్లా అధ్యక్షుడు కొప్పోలు కొండలరావు, దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు పీకా మధుసూదన్‌రావు, మాలల జేఏసీ సభ్యులు మేడిది రవి, లక్ష్మీనారాయణ, స్వర్ణ శ్రీహరి, నత్తల నాని, శాంతారావు, కేవీ కృష్ణారావు, దేవరపల్లి చంద్రబాబు, సురేష్, నత్తల క్రాంతికుమార్, రాంబాబు, పూర్ణ వికాస్, దాసరి ప్రసాద్, అనిల్ తదితరులు ఉన్నారు.