Share News

వైసీపీది విధ్వంసం.. టీడీపీది ఆదర్శది0

ABN , Publish Date - Jun 15 , 2026 | 11:31 PM

రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలన వైసీపీదని - ఆదర్శ పాలన చంద్రబాబుదని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం టంగుటూరులోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి - సంక్షేమం’ కొండపి నియోజకవర్గస్థాయి విజయోత్సవ సభలో మంత్రి స్వామి మాట్లాడారు.

వైసీపీది విధ్వంసం..  టీడీపీది ఆదర్శది0
ర్యాలీలో మంత్రి స్వామి, మారిటైం బోర్డు చైర్మన్‌ సత్య,ఉగ్రనరసింహారెడ్డి

విజయోత్సవ సభలో మంత్రి స్వామి

పాల్గొన్న మారిటైం బోర్డు చైర్మన్‌ సత్య,

టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఉగ్ర

టంగుటూరులో భారీ ర్యాలీ

టంగుటూరు (కొండపి), జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలన వైసీపీదని - ఆదర్శ పాలన చంద్రబాబుదని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం టంగుటూరులోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి - సంక్షేమం’ కొండపి నియోజకవర్గస్థాయి విజయోత్సవ సభలో మంత్రి స్వామి మాట్లాడారు. రెండేళ్లలో నియోజకవర్గంలో రూ.532 కోట్ల మేర అభివృద్ధి పనులు చేశామన్నారు. మరో రూ.500 కోట్ల సంక్షేమం ప్రజలకు ప్రభుత్వం అందించిందన్నారు. వెలిగొండ నుంచి పాలేరుకు 0.6 టీఎంసీలు, సాగర్‌ కాలువల నుంచి 0.6 టీఎంసీల నీటిని ముసికి కేటాయించిన అపరభగీరథుడు చంద్రబాబు అని మంత్రి స్వామి కొనియాడారు. కొండపి నియోజకవర్గాన్ని రానున్న కాలంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో యువతకు 21 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న సత్సంకల్పంతో టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేష్‌ పనిచేస్తున్నారన్నారు. ప్రైవేటు రంగంలో ఇప్పటికే రెండు లక్షల ఉద్యోగాలు కల్పించారన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో వంద శాతం విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ నాయకులు ఏముఖం పెట్టుకుని రోడ్డెక్కుతున్నారని మంత్రి స్వామి ప్రశ్నించారు. మద్యం స్కాం పునాదులు జగన్‌ వైపే చూపిస్తున్నాయని, ఆయన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య మాట్లాడుతూ.. రెండేళ్లలో సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నారని చెప్పారు. కొండపి నియోజకవర్గంలో కార్యకర్తల సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి తాను ముందుంటానన్నారు. టీడీపీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ వైసీపీ అసత్యాలు, కుట్రలను తిప్పి కొట్టి ప్రజల్లోకి వాస్తవాలను తీసుకెళ్లాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. డీఎస్సీపై వైసీపీ పత్రిక రోజూ అబద్ధాలను వండి వారుస్తున్నదని ఆయన అన్నారు.

భారీ ర్యాలీ

విజయోత్సవ సభ సందర్భంగా టంగుటూరులోని ప్రధాన వీధుల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఎన్టీఆర్‌, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టంగుటూరు మండల టీడీపీ అధ్యక్షుడు చదలవాడ చంద్రశేఖర్‌ అధ్యక్షతన జరిగిన విజయోత్సవ సభలో పార్టీ నియోజకవర్గ పరిశీలకురాలు చందన స్రవంతి, టీడీపీ మండలాల అధ్యక్షులు పోకూరి రవీంద్రబాబు, మించల బ్రహ్మయ్య, శ్రీనివాసరెడ్డి, కొర్రపాటి వసంతరాయుడు, పోటు శ్రీనివాసమరళి, బెల్లం జయంత్‌బాబు, బెజవాడ వెంకటేశ్వర్లు, టీడీపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర నాయకుడు దర్నాశి బ్రహ్మానందం, మద్దిరాల మమత, బొద్దులూరి ప్రసన్నలక్ష్మి, బీజేపీ నియోజకవర్గ నాయకుడు మిడసల బాలకోటయ్య, జనసేన నియోజకవర్గ నాయకుడు కనపర్తి మనోజ్‌కుమార్‌, ఎంపీ మాగుంట కార్యాలయ ప్రతినిధి బెజవాడ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2026 | 11:31 PM