Share News

వైపాలెం పోలీస్‌ స్టేషన్‌ వద్ద వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ చిందులు

ABN , Publish Date - Apr 19 , 2026 | 11:45 PM

ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ తన అనుచరులతో కలిసి ఆదివారం స్థానిక పోలీ్‌సస్టేషన్‌ వద్దకు చేరి హల్‌చల్‌ చేశారు. పోలీసులపై చిందులు తొక్కారు.

వైపాలెం పోలీస్‌ స్టేషన్‌ వద్ద   వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ చిందులు
ఎస్సై దేవకుమార్‌తో వాగ్వివాదం చేస్తున్న ఎమ్మెల్యే చంద్రశేఖర్‌

తనపై పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు బెదిరింపు

వైసీపీ కార్యకర్తలపై కేసుల విషయమై ఎస్సైతో వాదులాట

ర్యాలీకి అనుమతి లేకపోయినా అనుచరులతో హల్‌చల్‌

ఎర్రగొండపాలెం రూరల్‌, ఏప్రిల్‌ 19 (ఆం ధ్రజ్యోతి) : ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ తన అనుచరులతో కలిసి ఆదివారం స్థానిక పోలీ్‌సస్టేషన్‌ వద్దకు చేరి హల్‌చల్‌ చేశారు. పోలీసులపై చిందులు తొక్కారు. ఎస్సై దేవకుమార్‌తో వాదులాటకు దిగారు. తమ ఫిర్యాదులపై కేసు నమోదు చేయాల్సిందేనంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడారు. మీకు న్యాయం జరగకపోతే మీ లీగల్‌ అడ్వయిజర్‌తో మాట్లాడి ముందుకు వెళ్లండని ఎస్సై సమాధానమిస్తున్నా వినకుండా హడావుడి చేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఏబీఎన్‌-ఆంరఽధజ్యోతి కార్యాలయం ఎదుట ధర్నా అంటూ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ హడావుడి చేస్తూ కార్యాలయం వైపు దూసుకువెళుతున్న సమయంలో అక్క డి పోలీసులు ఆయన్ను తోసేసిన ఘటన సోషల్‌ మీడియాలో వచ్చిం ది. దానిని ఎందుకు షేర్‌ చేశావంటూ ఎర్రగొండపాలెంలోని అజహర్‌ అనే టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్తను వైసీపీ నాయకులు కొందరు బెదిరించారు. అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై ఆధారాలతో టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిని ప్రశ్నించే కార్యక్రమం పేరుతో ఆదివారం స్టేషన్‌ వద్దకు ఎమ్మెల్యే తన అనుచరులతో ప్రదర్శనగా వచ్చారు. నిరసన ర్యాలీకి అనుమతులు లేవని ఎస్‌ఐ దేవకుమార్‌ చెప్తున్న క్రమంలో ఆయనతోపాటు సిబ్బందిపై ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ బెదిరింపు ధోరణితో మాట్లాడారు. ఏమైనా ఉంటే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఎస్‌ఐ చెప్పినప్పటికీ ఎమ్మెల్యే వినిపించుకోకుండా దురుసుగా ప్రవర్తించారు. తనపై అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తారా? లేదా? అంటూ గద్దించారు. రేపు మా ప్రభుత్వం వస్తే టీడీపీ వారిపై ఒకటికి పది కేసులు నమోదు చేసి అంతుచూస్తామని వ్యాఖ్యానించారు. మీరు చట్టపరంగా ముందుకెళ్లండి మాకు అభ్యంతరం లేదని ఎస్సై దేవకుమార్‌ సమాధానమిచ్చారు. కొంతసేపు హడావుడి చేసిన తరువాత ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Updated Date - Apr 19 , 2026 | 11:45 PM