డిష్యుం.. డిష్యుం..
ABN , Publish Date - Jul 09 , 2026 | 02:47 AM
ఇద్దరు వైసీపీ మహిళా నాయకురాళ్ల మధ్య ఏర్ప డిన వివాదం ఘర్షణకు దారితీసింది. వైఎస్ రాజశే ఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన వేడుకల కార్యక్రమం ఇందుకు వేదికైంది.
ఒంగోలులోని వైసీపీ ఆఫీసులో ఘర్షణ
ఒక మహిళా నాయకురాలి భర్త మరో నాయకురాలిపై దాడి
రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు
అరుపులతో దద్దరిల్లిన కార్యాలయం
ఒంగోలు కలెక్టరేట్, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : ఇద్దరు వైసీపీ మహిళా నాయకురాళ్ల మధ్య ఏర్ప డిన వివాదం ఘర్షణకు దారితీసింది. వైఎస్ రాజశే ఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన వేడుకల కార్యక్రమం ఇందుకు వేదికైంది. కేక్ కటింగ్ చేసే సమ యంలో వైసీపీ ఎస్టీ సెల్ ఒంగోలు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పేరం ప్రసన్న, మరో మహిళా నాయకురాలు మేరీకుమారి మధ్య వాగ్వాదం చేటుచేసు కుంది. ప్రసన్న కాలును మేరీకుమారి తొక్కడంతో గొడవ మొదలైంది. ఆ సమయంలో అక్కడ ఉన్నవారు సర్దిచెప్ప డంతో మొదట ఆగారు. కార్యక్రమం ముగిసిన అనం తరం మరోసారి వివాదం మొదలైంది. మేరీకుమారి భర్త శివకుమార్ ఒక్కసారిగా ప్రసన్నపై దాడిచేశారు. దీంతో ప్రసన్న కూడా కేకలు వేస్తూ ఎదురుదాడికి దిగారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు వారిని విడిపించేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. ప్రసన్నపై దాడి విష యాన్ని తెలుసుకున్న కొంతమంది నాయకులు అక్కడకు చేరుకొని శివకుమార్‌పై దాడికి ప్రయత్నించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. కేకలు, అరుపులు, తోపులాటలతో పార్టీ కార్యాలయం దద్దరిల్లిపోయింది. ఈ ఘర్షణలో కొందరు కిందపడ్డారు. అలా ఒక్కసారిగా రణరంగంగా మారడంతో కొంతమంది పెద్ద నాయకులు జోక్యం చేసుకొని వారిని సముదాయిం చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో తనపై దాడి చేసిన మహిళా నాయకురాలి భర్త శివకుమార్‌పై ప్రసన్న విరుచుకుపడ్డారు. విషయాన్ని ఇంతటితో వదిలి పెట్టేది లేదని, పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు.
ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
మేరీకుమారి, ఆమె భర్త శివకు మార్ తనపై దాడి చేసి కులం పేరుతో దూషించా రని ప్రసన్న ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ ఉన్న మెట్టెల వెంకు, కటారి సాయి, సంజీవ్‌లు కూడా తనను దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఒంగోలు తాలూకా సీఐ విజయకృష్ణ తెలిపారు.