Share News

నామినేషన్ల పరిశీలనలో వైసీపీ రగడ

ABN , Publish Date - Nov 18 , 2026 | 10:55 PM

పీసీపల్లి మండలంలోని పెదయిర్లపాడు గ్రామంలో నామినేషన్‌ పరిశీలన సందర్భంగా బుధవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి నామినేషన్‌ పత్రాల్లో తప్పులున్నాయని, ఉద్దేశపూర్వకంగా అతనికి ఉన్న ఆస్తులన్నింటినీ వెల్లడించలేదని టీడీపీ మద్దతుతో పోటీ చేసిన వ్యక్తి అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం చివరకు ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది.

నామినేషన్ల పరిశీలనలో వైసీపీ రగడ
స్వర్ణగ్రామ కార్యాలయం తలుపులు బద్దలు కొట్టేందుకు దూసుకెళ్తున్న వైసీపీ శ్రేణులు

పెదయిర్లపాడులో రెచ్చిపోయిన ఆ పార్టీ శ్రేణులు

వైసీపీ మద్దతు అభ్యర్థి నామినేషన్‌లో తప్పులు ఉన్నాయంటూ టీడీపీ అభ్యంతరం

స్వర్ణగ్రామ కార్యాలయం తలుపులు బద్దలుకొట్టి లోపలికి దూసుకెళ్లిన వైసీపీ నాయకులు

పీసీపల్లి, నవంబరు18(ఆంధ్రజ్యోతి): మండలంలోని పెదయిర్లపాడు గ్రామంలో నామినేషన్‌ పరిశీలన సందర్భంగా బుధవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి నామినేషన్‌ పత్రాల్లో తప్పులున్నాయని, ఉద్దేశపూర్వకంగా అతనికి ఉన్న ఆస్తులన్నింటినీ వెల్లడించలేదని టీడీపీ మద్దతుతో పోటీ చేసిన వ్యక్తి అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం చివరకు ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. వివరాలలోకి వెళ్తే... పెదయిర్లపాడు స్వర్ణగ్రామ కార్యాలయంలో ఆర్వో చింతగుంపల్లి పంచాయతీ నామినేషన్‌లను పరిశీలిస్తున్నారు. టీడీపీ తరఫున ముగ్గురు, వైసీపీ తరఫున ఐదుగురు నామినేషన్‌ దాఖలు చేశారు. వీటిని పరిశీలిస్తున్న క్రమంలో వైసీపీ మద్దతు అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన భూమిరెడ్డి కొండారెడ్డి తన ఆస్తుల వివరాలను దాచిపెట్టారని టీడీపీ మద్దతుతో పోటీచేసిన వెెంకటరమణారెడ్డి ఆర్వోకు ఫిర్యాదుచేశారు. ఈక్రమంలో బయట ఉన్న వైసీపీ మద్దతుదారులు ఒక్కసారిగా స్వర్ణగ్రామ కార్యాలయం వద్దకు వచ్చి అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులతో ఘర్షణకు దిగారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదంతో పాటు తోపులాట చోటుచేసుకుంది.


తలుపులు బద్దలుకొట్టి లోనికి చొచ్చుకెళ్లిన వైసీపీ శ్రేణులు

ఇరువర్గాల మధ్య వివాదం జరుగుతున్న సమయంలో పెదయిర్లపాడు పంచాయతీకి సంబంధించిన ఓ నాయకుడు, చింతగుంపల్లి పంచాయతీకి సంబంధించిన మరికొంతమంది వైసీపీ నాయకులు అక్కడ ఉన్న వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. ఈ క్రమంలో వెైసీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా స్వర్ణగ్రామ కార్యాలయ తలుపులను కాళ్లతో తన్ని బద్దలుకొట్టి లోనికి చొచ్చుకుని వెళ్లారు. ఈ హఠాత్పరిణామానికి ఆర్వోతో పాటుసిబ్బంది ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై నరసింహారావు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను పంపించివేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న డీఎస్పీ మద్ది శ్రీనివాసరావు హుటాహుటిన అక్కడకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Nov 18 , 2026 | 10:55 PM