Share News

తుది ఓటర్ల జాబితాపై కసరత్తు

ABN , Publish Date - Mar 26 , 2026 | 01:41 AM

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో వచ్చేనెల 15వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు జిల్లా పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు.

తుది ఓటర్ల జాబితాపై కసరత్తు

వచ్చేనెల 15న పంచాయతీల్లో ప్రచురణ

ఏర్పాట్లు చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశం

ఒంగోలు కలెక్టరేట్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో వచ్చేనెల 15వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు జిల్లా పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే మొత్తం 729 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను సిద్ధం చేశారు. వాటిని అన్ని పంచాయతీల్లో ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ బుధవారం ఆదేశాలు జారీచేయడంతో తదనుగుణంగా చర్యలు తీసుకున్నారు. పంచాయతీ పరిధిలోని వార్డులు, ఇంటి నెంబర్ల వారీగా ఫొటోతో ఉన్న ఓటర్ల జాబితాలను ప్రచురించనున్నారు.

Updated Date - Mar 26 , 2026 | 01:41 AM