Share News

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:11 PM

పంగులూరు, మండలంలోని ముప్పవరం ప్రధాన కూడలిలో 16వ నెంబరు జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

పంగులూరు, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి) : మండలంలోని ముప్పవరం ప్రధాన కూడలిలో 16వ నెంబరు జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. కాకినాడ నుంచి బెంగళూరు వెళుతున్న ఆర్టీసీ ఓల్వా బస్సు మంగళవారం అర్ధరాత్రి సమయంలో ముప్పవరం ఫ్లైఓవర్‌పై అదే గ్రామానికి చెందిన సింగంశెట్టి రమణ(60) అనే మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్‌ఐ వినోద్‌బాబు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Updated Date - Jun 17 , 2026 | 11:11 PM