భర్త హత్య కేసులో భార్య, మామ, బావమరిది అరెస్ట్
ABN , Publish Date - Aug 18 , 2026 | 11:17 PM
అనుమానంతో తరచూ వేధింపులకు గురిచేస్తున్న భర్త శ్రీకాంత్‌రెడ్డిపై దాడి చేసి హతమార్చిన కేసులో భార్యతో పాటు మరో ఇద్దరు కుటుంబసభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కనిగిరి జేఎ్‌ఫసీఎం కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయాధికారి
పీసీపల్లి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి) : అనుమానంతో తరచూ వేధింపులకు గురిచేస్తున్న భర్త శ్రీకాంత్‌రెడ్డిపై దాడి చేసి హతమార్చిన కేసులో భార్యతో పాటు మరో ఇద్దరు కుటుంబసభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను మంగళవారం కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి.. 14రోజుల రిమాండ్ విధించారు. పీసీపల్లి పోలీసుల ప్రకటన మేరకు... మండలంలోని మూలెవారిపల్లికి చెందిన పుల్లారెడ్డి కుమార్తె ధనలక్ష్మికి పామూరు మండలం కొత్తపల్లికి చెందిన శ్రీకాంత్‌రెడ్డితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న శ్రీకాంత్‌రెడ్డి శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. వీరి మధ్య ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో ఈనెల14న శ్రీకాంత్‌రెడ్డి మళ్లీ ఆమెతో గొడవకు ది గాడు. ఈ విషయాన్ని ఆమె తన తండ్రి పుల్లారెడ్డి, సోదరుడు మల్లికార్జునరెడ్డికి తెలిపింది. వారు వచ్చి అతనిపై కర్రలు, రోకలిబండతో దాడిచేయడంతో అక్కడికక్కడే అతడు మృతచెందాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం నిందితులు మూలెవారిపల్లిలోని వారి పొలాల వద్ద ఉండగా కనిగిరి సీఐ శ్రీనివాసులు, ఎస్సై నరసింహరావులు అరెస్టుచేశారు. కోర్టులో హజరు పరచగా న్యాయాధికారి నిందితులకు 14రోజుల రిమాండ్ విధించినట్లు పోలీసులు వెల్లడించారు.