Share News

మేము చేసింది తప్పే.. క్షమించండి

ABN , Publish Date - Sep 27 , 2026 | 11:33 PM

‘మేము చేసింది తప్పే.. క్షమించండి’ అంటూ ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం అగ్రహారానికి చెందిన వైసీపీ నాయకులు చేతులెత్తి నమస్కరించి ఆ గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు, నీటి సంఘం అధ్యక్షుడు కంచుమాటి నాగేశ్వరరావుకు క్షమాపణలు చెప్పారు.

మేము చేసింది తప్పే.. క్షమించండి
క్షమాపణ చెబుత్ను వైసీపీ నేతలు

చేతులెత్తి నమస్కరిస్తూ టీడీపీ నేతకు వైసీపీ నాయకుల క్షమాపణలు

ముండ్లమూరు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ‘మేము చేసింది తప్పే.. క్షమించండి’ అంటూ ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం అగ్రహారానికి చెందిన వైసీపీ నాయకులు చేతులెత్తి నమస్కరించి ఆ గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు, నీటి సంఘం అధ్యక్షుడు కంచుమాటి నాగేశ్వరరావుకు క్షమాపణలు చెప్పారు. ఉమామహేశ్వరపురం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన గణనాథునికి ఈనెల 21న నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా టీడీపీ యువత, మహిళలు, వృద్ధులు గులాములు చల్లుకుంటూ, బాణసంచా కాలుస్తూ, డీజే పాటలతో తీన్మార్‌ డప్పులతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఈక్రమంలో గ్రామం నడిబొడ్డులో ఉన్న వైఎస్సార్‌ విగ్రహంపై గులాము పడింది. ఈనెల 22న నాగేశ్వరరావు ఆమార్గంలో వెళ్తుండగా వైసీపీ నాయకులు పిలిచి వైఎస్‌ విగ్రహంపై ఉన్న గులామును కడగాలని ఒత్తిడి చేశారు. దీంతో నాగేశ్వరరావు గ్రామంలో గొడవలు జరగకుండా ఉండాలన్న సదుద్దేశంతో నీటి పైపుతో విగ్రహంపై ఉన్న గులామును శుభ్రం చేశాడు. ఆసమయంలో అతనికి తెలియకుండా వైసీపీ నాయకులు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయింది. ఆ వీడియోను చూసి మనస్తాపం చెందిన నాగేశ్వరరావు ఈనెల 24న స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ పి.కోటేశ్వరరావు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీంతో వైసీపీ నాయకులు తాము చేసిన పని తప్పంటూ ఆదివారం సాయంత్రం గ్రామంలోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, తమ పార్టీ కార్యకర్తల సమక్షంలో నాగేశ్వరరావుకు క్షమాపణలు చెప్పారు.

Updated Date - Sep 27 , 2026 | 11:33 PM