శనగ రైతులకు గిట్టుబాటు ధర ఏది..?
ABN , Publish Date - Jan 02 , 2026 | 09:55 PM
పండించిన పంటలకు గిట్టబాటు ధరలేక, మరో వైపు సాగు చేసిన పంటలను క్రిమి కీటకాల బెడద నుంచి కాపాడుకోలేక శనగ రైతులు మానసిక క్షోభకు గురవుతున్నారు.
పర్చూరు, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : పండించిన పంటలకు గిట్టబాటు ధరలేక, మరో వైపు సాగు చేసిన పంటలను క్రిమి కీటకాల బెడద నుంచి కాపాడుకోలేక శనగ రైతులు మానసిక క్షోభకు గురవుతున్నారు.
జిల్లాలోనే అత్యధిక విస్తీర్ణంలో పర్చూరు వ్యవసాయ సబ్‌డివిజన్‌లో పండించిన పంట మూడేళ్లగా శీతల గిడ్డంగుల్లో శనగ నిల్వ ఉంది. గిట్టుబాటు ధర కోసం ఎదురు చూపులు చూస్తున్న రైతులకు ఎండమావిని తలపించే విధంగా పరిస్థితి నెలకొంది. శనగకు ప్రభుత్వ గిట్టబాటు క్వింటాకు రూ.5,875 కాగా ప్రస్తుత మార్కెట్‌లో (జెజి-11) రూ.5వేలకు మించి కొనే దిక్కు కనపించడం లేదని రైతులు వాపోతున్నారు. గతంలో రూ.6500 పలికిన ధర క్వింటాకు రూ.1500 మేర తగ్గింది. పాత నిల్వలు మగ్గుతున్న ప్ప టికీ, ఈ ఏడాది గత్యం తరం లేని పరిస్థితుల్లో మళ్లీ శనగ పంటను సాగుచేయాల్సి వచ్చిందని రైతులు చెబుతున్నారు. పొలాలను ఖాళీగా వదలలేక, ఇతర పంటలను సాగు చేయలేక శనగను సాగు చేశామని అన్నదాతలు పేర్కొన్నా రు. ప్రస్తుతం బెట్ట, ఎండుతెగుళ్ల వంటి సమస్యలతో దిగుబడి ప్రశ్నా ర్థకంగా మారింది. దీంతో కనీస దిగుబడి కూడా రాదన్న భయం తో ఎకరానికి రూ.5 వేలు వెచ్చించి బెట్ట పరిస్థితిని అధిగమించేం దుకు స్ర్పికర్ల సహాయంతో నీటితడులు అందిస్తున్నారు. ఇది అదనపు భారమైన దిగు బడి ఎలా ఉంటుందో అన్న ఆలోచనలో రైతులు ఉన్నారు. ప్రస్తుతం శనగ రైతుల పరి స్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మద్దతు ఽధరకు కొనుగోలు చేస్తే కొంతైనా మేలు జరుగుతుందని రైతులు ఆశిస్తున్నారు. అన్న దాతల ఆర్థిక ఇబ్బందులు, వ్యవసాయ రంగా న్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి, ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి ఆదుకుంటే రైతులకు కొంతమేర అయినా మేలు చేకూరుతుందని వ్యవసాయరంగ నిపుణులు అంటున్నారు. ఆ దిశగా కొనుగోలు చేయకపోవడంతో అన్న దాతల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతోందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.