Share News

సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - May 22 , 2026 | 01:21 AM

: ప్రజల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు.

సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి గొట్టిపాటి, కలెక్టర్‌ విజయసునీత

మంత్రి గొట్టిపాటి

పెద్దదోర్నాల, మే 21 (ఆంధ్రజ్యోతి) : ప్రజల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు. దోర్నాలలో ఆర్టీసీ బ స్టాండ్‌ నిర్మాణ భూమి పూజలో మంత్రి గొట్టిపాటితోపాటు కలెక్టర్‌ విజయసునీత, ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ సురే్‌షరెడ్డి, ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, టీడీపీ వైపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడు తూ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి రోజూ దోర్నా ల నుంచి 400 బస్సు సర్వీసులు నడుస్తుంటాయన్నారు. ఇక్కడ బస్టాండ్‌ లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఎరిక్షన్‌బాబు స్థానికుల సహకారంతో నిధుల మంజూరుకు ఎంతో కృషి చేశారని చెప్పారు. ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరు చేసిందని, మొదటి విడతగా రూ.44లక్షలతో పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. నాలుగునెలల్లో అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దోర్నాలలో అన్న క్యాంటీన్‌ ఆవశ్యకతను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి మంజూరుకు కృషి చేస్తానన్నారు. మరోపక్క దూపాడు నుంచి సాగర్‌ జలాలు దోర్నాల ప్రజలకు చేరువైనట్లు చెప్పారు. పీఎం సూర్యఘర్‌ పథకంలో భాగంగా పేదలకు ఉచిత సోలార్‌ విద్యుత్‌ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 6వేల కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోనే సోలార్‌ కోసం రూ.32కోట్ల వరకు వెచ్చించినట్లు మంత్రి తెలిపారు. జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్యమంత్రి ఆదేశాలతో వారంవారం పర్యవేక్షిస్తూ వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి కృషి చేస్తున్నారన్నారు. త్వరలోనే ప్రాజె క్టు నిర్మాణం పూర్తి చేసుకుని కృష్ణానీటితో ఈ ప్రాంతం సస్యశ్యామలం కా నుందని చెప్పారు. ఎర్రగొండపాలెం ని యోజకవర్గ అభివృద్ధి కోసం ఎరిక్షన్‌బాబు నిరంతరం కష్టపడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ మద్దతుగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని గొట్టిపాటి కోరారు. కలెక్టర్‌ విజయసునీత మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మాణం లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఇది శుభవార్త అన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఏర్పడిన స్థానిక కమిటీ సభ్యులను మంత్రి సన్మానించారు. అనంతరం మండలంలోని చిన్నగుడిపాడులో ఎస్సీకాలనీలో సోలార్‌ విద్యుత్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించి కాలనీవాసులతో మాట్లాడారు. కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు, డీఈ నాగేశ్వరరావు, మార్కాపురం ఆర్‌డీవో ప్రభాకర్‌, తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీవో ప్రసూనదేవి, టీడీపీ మండలాధ్యక్షుడు షేక్‌ మాబు, నాయకులు బట్టు సుధాకర్‌ రెడ్డి, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, చంటి, రామిరెడ్డి పాల్గొన్నారు. తొలుత అతిథులకు స్థానిక నాయకులు పూలచల్లి ఘన స్వాగతం పలికారు.

విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ప్రారంభం

పుల్లలచెరువు : మండలంలోని ఐటీవరంలో రూ.3.80కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను విద్యుత్‌ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ శాఖలో పారదర్శకత, వేగవంతమైన సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా నూతనంగా 625 పోస్టులను భర్తీ చేస్తున్నామని వెల్లడించారు.

Updated Date - May 22 , 2026 | 01:21 AM