Share News

ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటాం

ABN , Publish Date - Mar 31 , 2026 | 11:29 PM

ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలువడమే తె లుగుదేశం పార్టీ ధ్యేయమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ఇటీవల కంభం పట్టణానికి చెందిన ఇద్దరు పార్టీ కార్యకర్తలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, వారికి తెలుగుదేశం పార్టీ ప్రమాద బీమా కింద రూ.10లక్షల చెక్కులను ఆ కుటుంబాలకు అందించారు.

ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటాం
బాధితులకు బీమా చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

బాధిత కుటుంబలకు రూ.10లక్షల బీమా

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు టౌన్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలువడమే తె లుగుదేశం పార్టీ ధ్యేయమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ఇటీవల కంభం పట్టణానికి చెందిన ఇద్దరు పార్టీ కార్యకర్తలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, వారికి తెలుగుదేశం పార్టీ ప్రమాద బీమా కింద రూ.10లక్షల చెక్కులను ఆ కుటుంబాలకు అందించారు. మంగళవారం పట్టణంలోని ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమం లో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కంభం పట్టణానికి చెందిన అప్పరబోయిన శ్రీనివాసులు భార్య రం గలక్ష్మమ్మకు అశోక్‌రెడ్డి రూ.5లక్షల చెక్కును అందచేశారు. అలాగే బేస్తవారపేట పట్టణానికి చెందిన చిన్నరంగయ్య మృతిచెందగా ఆయన భార్య ఎస్తేరమ్మకు రూ.5లక్షల చెక్కును అందించారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియ చేస్తున్నానని, కుటుంబ పెద్దను కోల్పోవడం బాధాకరమని, అలాంటి క్లిస్టసమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని ధైర్యం చె ప్పారు. టీడీపీ సభ్యత్వం తీసుకుని ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ అధినేత చంద్రబాబు, యువ నాయకుడు నారా లోకేష్‌ కల్పించిన ఈ బీమా సౌకర్యం ఆ కుటుంబాలకు ఆర్థికంగా ఉపకరిస్తుందన్నారు. కార్యక్రమంలో కంభం మండల పార్టీ అధ్యక్షుడు తోట వెంకట శ్రీనివాసరావు, ఆసుపత్రి మాజీ చైర్మన్‌ శ్రీనివాసులు, ఇల్లా సోమయ్య, భూపాల్‌, రవి, బేస్తవారపేట పట్టణ పార్టీ అధ్యక్షులు దూదేకుల సైదులు, మట్టా రమేష్‌, బోయిళ్ళ రోషన్‌బాబు, సందు రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 11:29 PM