సమస్యలను పరిష్కరిస్తాం
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:05 PM
సమస్యలను పరిష్కరించి, సంక్షేమం అం దిస్తామని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఎస్.వెంకటరామిరెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ప్రజాదర్బార్ లో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
రాచర్ల, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : సమస్యలను పరిష్కరించి, సంక్షేమం అం దిస్తామని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఎస్.వెంకటరామిరెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు భూ సమస్యలు, పెన్షన్లు, గృహ నిర్మాణ, ఉపాధి, వ్యవసాయ, పశుసంవర్థక శాఖలకు సంబంధించి వివిధ రకాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సంగపేటలో సీసీ రోడ్డు, రాచర్లలో అంబేడ్కర్ భవనం, రాచర్ల ఫారం గ్రామంలో సొసైటీ భూములను పరిశీలించి విచారణ జరిపి అనుభవంలో ఉన్నవారికి ఆన్‌లైన్ చేయాలని టీడీపీ నేత డి ఖాశిం తదితరులు విన్నవించారు. మరికొందరు తమ భూములు ఆన్‌లైన్ చేశారని, కానీ రెండు ఎకరాలు ఉండగా 1.67సెంట్లు మాత్రమే ఆన్‌లైన్ అయిందని, మరొకరు 49సెంట్లకుగాను 25సెంట్లు నమోదు అయిందని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. వీటన్నిటిపై స్పం దించిన ఆయన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి విచారించి చట్టబద్ధంగా ఉన్న ప్రతి అర్జీకి పరిష్కారం చూపిస్తామన్నారు. ప్రజాదర్బార్‌లో 43అర్జీలు వచ్చాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో తహసీ ల్దార్ ఎల్ వెంకటేశ్వర్లు, రాష్ట్ర జీబీసీ డైరెక్టర్ యోగానంద్, రాచర్ల, రామాపురం సొసైటీ బ్యాంకు చైర్మన్‌లు జి జీవనేశ్వర్ రెడ్డి, బీ పుల్లారెడ్డి, ఒంగోలు జిల్లా పార్లమెంట్ ట్రెజరర్ శ్రీనివాసరెడ్డి, గిద్దలూరు ఏఎంసీ చైర్మన్ బాలయ్య, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.