ప్రతి ఎకరాకు వెలిగొండ నీరు అందిస్తాం
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:28 AM
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ నీరు అందిస్తామని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు.
గిద్దలూరు టౌన్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ నీరు అందిస్తామని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం గిద్దలూరు పట్టణంలోని మార్కెట్‌యార్డు నందు అన్నదాత సుఖీభవ-ప్రధానమంత్రి కిసాన్ 3వ విడత పంపిణీ కార్యక్రమంలో ఆయన రైతులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 37,649 మంది రైతులకు 6వేల చొప్పున 22,58,94,000 రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్‌చైర్మన్లు బైలడుగు బాలయ్య, గోడి ఓబులరెడ్డి, మున్సిపల్ చైర్మన్ పాముల వెంకటసుబ్బయ్య, కొమరోలు మండల పార్టీ అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు కొత్తపల్లి శ్రీనివాసులు, కుప్పా రంగసాయిపాల్గొన్నారు.