Share News

శనగ రైతులకు మేలు చేస్తాం

ABN , Publish Date - Jan 11 , 2026 | 01:36 AM

శనగ రైతుల సమస్య లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి మేలు జరిగేలా చర్యలు తీసుకుంటానని, మొత్తం కొనుగోలు చేసేలా చూస్తానని బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి పేర్కొ న్నారు. స్థానిక విష్ణుప్రియ కన్వెన్షన్‌ హాలులో శనివారం కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన శనగ రైతుల సదస్సులో ఆయన మాట్లాడారు.

శనగ రైతులకు మేలు చేస్తాం
మాట్లాడుతున్న కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి

మాట్లాడుతున్న కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి

సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి

ఒంగోలులో రైతు సదస్సుకు హాజరు

ఒంగోలు కలెక్టరేట్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి) : శనగ రైతుల సమస్య లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి మేలు జరిగేలా చర్యలు తీసుకుంటానని, మొత్తం కొనుగోలు చేసేలా చూస్తానని బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి పేర్కొ న్నారు. స్థానిక విష్ణుప్రియ కన్వెన్షన్‌ హాలులో శనివారం కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన శనగ రైతుల సదస్సులో ఆయన మాట్లాడారు. దేశానికి దిగుమతయ్యే శనగలపై ఎక్కువ సుంకం విధించే విధంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. శనగ రైతులు అనేక అంశాలను సభ దృష్టికి తెచ్చారని వీటన్నింటినీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఒంగోలు, మద్దిపాడు, కనిగిరి మార్కెట్‌ కమిటీ చైర్మన్లు ఆర్‌.వెంకట్రావు, మన్నం ప్రసాద్‌, శ్రీనివాసరావు మాట్లాడుతూ శనగ రైతుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అవసరమైతే కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి ఆధ్వర్యంలో ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శెగ్గం శ్రీనివాసరావు మాట్లాడుతూ శనగ రైతులకు మేలు జరిగే విధంగా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు కావూరి వాసు అధ్యక్షతన జరిగిన సదస్సులో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి, పీవీ కృష్ణారెడ్డి, ఉన్నం సింహాద్రినాయుడు, వైవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2026 | 01:36 AM