రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
ABN , Publish Date - May 21 , 2026 | 03:37 AM
ఆంధ్రకేసరి టంగు టూరి ప్రకాశం పంతులు పోరాట స్ఫూర్తి, త్యాగాలను ఆదర్శంగా తీసు కొని ప్రతి ఒక్కరూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి పిలుపునిచ్చారు. ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా బుధవారం ఒంగోలు కలెక్టరేట్ ఆవరణలోని ఆయన విగ్రహానికి ఇన్‌చార్జి కలెక్టర్ కల్పనాకుమారి, ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయకుమార్, ఒడా చైర్మన్ షేక్ రియాజ్, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీలతో కలిసి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మంత్రి డాక్టర్ స్వామి పిలుపు
ప్రకాశం పంతులుకు నివాళి
ఒంగోలు కలెక్టరేట్, మే 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రకేసరి టంగు టూరి ప్రకాశం పంతులు పోరాట స్ఫూర్తి, త్యాగాలను ఆదర్శంగా తీసు కొని ప్రతి ఒక్కరూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి పిలుపునిచ్చారు. ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా బుధవారం ఒంగోలు కలెక్టరేట్ ఆవరణలోని ఆయన విగ్రహానికి ఇన్‌చార్జి కలెక్టర్ కల్పనాకుమారి, ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయకుమార్, ఒడా చైర్మన్ షేక్ రియాజ్, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీలతో కలిసి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ... స్వాతంత్య్రం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి ప్రకాశం పంతులు అని కొనియాడారు. జిల్లాలోని వినోదరాయునిపాలెంలో జన్మించి, జాతికి చేసిన సేవలకు గుర్తుగా వారి పేరున ప్రకాశం జిల్లా ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో ఒంగోలు ఏఎంసీ చైర్మన్ వెంకటరావు, డీఆర్వో శ్రీధర్‌రెడ్డి, ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, అధికారులు డాక్టర్ వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, తహసీల్దార్ మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం టంగుటూరి మునిమనుమడు సంతోష్‌కుమార్‌ను సత్కరించారు.