Share News

మరింత అభివృద్ధి కోసం గెలవాలి

ABN , Publish Date - Nov 01 , 2026 | 02:56 AM

‘ఇప్పటికే శరవేగంగా సాగుతున్న ఒంగోలు నగరాభివృద్ధి మరింత ముందు కు వెళ్లేందుకు ఒంగోలు కార్పొరేషన్‌లో కూడా కూటమి పాలకవర్గం ఏర్పడితే మంచి ప్రయోజనం ఉంటుంది. అందుకే డివిజన్‌లలో కొన్ని సమస్యలు ఎదు రైనా కూటమిలోని అన్ని పార్టీలను కలుపుకొని ముందుకుపోతున్నాం. ఇప్పటి కే జరుగుతున్న అభివృద్ధి పనులకు తోడు సుమారు మరో రూ.700 కోట్ల నిధులు మంజూరయ్యాయి. నగరాభివృద్ధిలో నా ప్రణాళిక అమలుకు కార్పొరే షన్‌ పాలకమండలి కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. అందుకే కార్పొ రేషన్‌పై కూటమి జెండా రెపరెపలాడాలని కోరుకుంటున్నా’ అని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ అభిప్రాయపడ్డారు.

మరింత అభివృద్ధి కోసం గెలవాలి

రాబోయే ఏడాదిన్నరలో ఒంగోలు సంపూర్ణ సుందరీకరణ

శివారు కాలనీల అభివృద్ధి, పేదలకు ఇంటి స్థలాల పంపిణీకి ప్రాధాన్యం

మరో రూ.700 కోట్లపైన నిధుల మంజూరుకు గ్రీన్‌సిగ్నల్‌

‘ఆంధ్రజ్యోతి’తో ఎమ్మెల్యే దామచర్ల

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

‘ఇప్పటికే శరవేగంగా సాగుతున్న ఒంగోలు నగరాభివృద్ధి మరింత ముందు కు వెళ్లేందుకు ఒంగోలు కార్పొరేషన్‌లో కూడా కూటమి పాలకవర్గం ఏర్పడితే మంచి ప్రయోజనం ఉంటుంది. అందుకే డివిజన్‌లలో కొన్ని సమస్యలు ఎదు రైనా కూటమిలోని అన్ని పార్టీలను కలుపుకొని ముందుకుపోతున్నాం. ఇప్పటి కే జరుగుతున్న అభివృద్ధి పనులకు తోడు సుమారు మరో రూ.700 కోట్ల నిధులు మంజూరయ్యాయి. నగరాభివృద్ధిలో నా ప్రణాళిక అమలుకు కార్పొరే షన్‌ పాలకమండలి కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. అందుకే కార్పొ రేషన్‌పై కూటమి జెండా రెపరెపలాడాలని కోరుకుంటున్నా’ అని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ అభిప్రాయపడ్డారు. ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడుతూ రాజకీయంగా ఏ పార్టీకైనా గెలుపోటములు సహజం. కానీ ఒక పార్టీ గెలుపు ఒక ప్రాంత అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి తోడ్పడేదైతే ప్రజలు ఆ పార్టీనే గెలిపించాల్సిన అవసరం ఉంది. ఆ కోణంలోనే ఒంగోలు కార్పొరేషన్‌లో కూటమి అభ్యర్థులను గెలిపించమని ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం ముందుకుపోతోంది. పెన్షన్లకు డబ్బులు ఇవ్వటంలో కానీ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వటంతోపాటు బకాయిలు చెల్లించటంలో కానీ సూపర్‌సిక్స్‌ కింద ఇచ్చిన హామీలు అమలుచేయటంలో కానీ భూఆక్రమణలను అసాంఘిక కార్యక్రమాలను అరికట్టడంలో కానీ చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా నిలిచిందన్న విషయాన్ని గుర్తించాలని కోరారు. ఇక స్థానికంగా నగరాభివృద్ధి విషయంలో ప్రజలకు నిజాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో భూ ఆక్రమణలు, ఘర్షణలు, కొట్లాటలు తప్ప జరిగింది శూన్యం. ప్రస్తుతం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు బహిరంగంగానే కనిపిస్తున్నాయి. అమృత్‌-2 కింద చేపట్టిన మంచినీటి పథకం నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేస్తూ దశల వారీ ఆయాప్రాంతాలకు రోజువారీ తాగునీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. రానున్న ఆరునెలల నుంచి ఆపై ఆరేడు నెలలలోపు అన్ని ప్రాంతాలకు రోజువారీ మంచినీటి సరఫరాను చేయబోతున్నట్లు వెల్లడించారు. గుండ్లకమ్మ నీటికి తోడు రామతీర్థం నుంచి సాగర్‌ జలాలను అండర్‌గ్రౌండ్‌ ద్వారా ఒంగోలు తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఇవిగాక తాజాగా రమారమి మరో రూ.700 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. పోతురాజు కాలువ, నల్లకాలువ అభివృద్ధికి రూ.238 కోట్లు మంజూరయ్యాయని ఆ మేరకు ఫైనాన్స్‌ క్లియరెన్స్‌ కూడా లభించిందని వెల్లడించారు. ఇవిగాకుండా రహదారుల నిర్మాణం, అభివృద్ధికి మరో రూ.340 కోట్ల నిధులు మంజూరైన విషయాన్ని తెలిపారు. నగరంలో రోడ్ల అభివృద్ధితోపాటు తీరప్రాంత అభివృద్ధి, నియోజకవర్గం మొత్తాన్ని కలిపే రహదారుల నిర్మాణ పనులన్నింటినీ ఏకకాలంలో చేపడుతున్నట్లు తెలిపారు. ఒక ప్రశ్నకు బదులుగా శివారు కాలనీల్లో రోడ్లు అభివృద్ధి, డ్రైనేజీ సిస్టమ్‌ ఏర్పాటు పనులకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చామని తెలిపారు. ఇంకో ప్రశ్నకు బదులుగా అర్హులైన పేదలందరికీ ఇంటిస్థలాలు పంపిణీ, అలాగే టిడ్కో గృహాలు కేటాయింపు చేయబోతున్నట్లు వివరించారు. నగరంలో పింఛన్‌ అందని అర్హులందరికీ ఇవ్వనున్నట్లు కూడా తెలిపారు. త్వరలోనే కొతవి మంజూరు కాబోతున్న విషయాన్ని గుర్తుచేశారు. రాబోయే ఏడాదిన్నర రెండేళ్ల కాలంలో నగరాభివృద్ధితో పాటు సుందరీకరణ పూర్తిచేస్తామని ఇవన్నీ జరగాలంటే ఒంగోలు నగర పాలకసంస్థ కూడా కూటమి చేతిలో ఉంటే అడ్డంకులు లేకుండా ఉంటాయని వివరించారు. అందుకే జరుగుతున్న అభివృద్ధిని, జరగబోయేవి గుర్తించి నగరపాలకసంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరారు. అభివృద్ధి ముఖ్యం అన్న విషయాన్ని గుర్తించి ప్రతిఒక్కరూ తరతమ విభేదాలను పక్కనపెట్టి పనిచేయాలని పిలుపునిచ్చారు.

Updated Date - Nov 01 , 2026 | 02:56 AM